సినిమా అనేది జనాలకి ఒక ఎమోషన్ అయిపోయింది. అందుకే చాలా మంది సినిమాల ద్వారా ఎన్నో విషయాలని ప్రేక్షకులకు చెప్తూ ఉంటారు. సినిమాలు అన్నీ కూడా మంచి సందేశాలు మాత్రమే ఇవ్వవు. నిజ జీవితంలో ఉండే ఎంతో మంది మనుషుల గురించి, వారు ఎదుర్కొన్న ఎన్నో సంఘటనల గురించి సినిమాల్లో చూపిస్తారు.
అయితే ఈ క్రమంలో హీరోలు కేవలం మంచి అనే పదానికి ఉదాహరణగా మాత్రమే కాకుండా వారిలో కూడా ఎన్నో లోపాలని ఉన్నట్టు చూపిస్తారు. ఏదో సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు హీరోల పాత్రలు గ్రే షేడ్స్ ఉన్నాయి అని అంటున్నారు కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలం నుండే ఎన్నో సినిమాల్లో హీరోలు పర్ఫెక్ట్ గా లేనట్టు చూపించారు. ఇదే విషయం హీరోయిన్ల పాత్రని తీర్చిదిద్దే విధానానికి కూడా వర్తిస్తుంది.

ఇంక అసలు విషయానికొస్తే, చాలా రోజుల నుండి మాట్లాడుకుంటున్న ఒక సినిమా ఇప్పుడు విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా పేరు చెప్పకుండానే ఆ సినిమా ఏంటో అందరికీ ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. అవును. అదే సినిమా. బేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది, “రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ చూపించారు” అని అంటూ ఉంటే, కొంత మంది ఏమో, “ఇలాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు?” అని అంటున్నారు.

సమాజానికి ఇచ్చే మెసేజ్ పక్కన పెడితే, అసలు థియేటర్ రెస్పాన్స్ అని చెప్పి వచ్చిన వీడియోలో ఆ థియేటర్ రెస్పాన్స్ చూస్తే తప్పు ఎవరిలో ఉందో అర్థం అయిపోతోంది. ఒక డైరెక్టర్ బాధ్యత తాను ఎంచుకున్న పాయింట్ ని తెరపై బాగా చూపించడం. ప్రతి డైరెక్టర్ మెసేజ్ ఇచ్చే సినిమాలు మాత్రమే తీయరు. ఆ సినిమా నుండి తీసుకునే మెసేజ్ మనలో ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ బేబీ సినిమా థియేటర్ రెస్పాన్స్ వీడియో.

ఇందులో హీరోయిన్ ని హీరో ఒక బూతు మాట పెట్టి తిడతాడు. ఆ ఒక్క మాటతో ఆగకుండా ఇంకా ఎన్నో మాటలు మాట్లాడి అవమానిస్తాడు. ఈ సీన్ చాలా వైరల్ అయ్యింది. “అసలు సినిమాలో ఇలాంటి ఒక తిట్టు ఎలా పెట్టారు” అని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ తర్వాత ఇదే విషయంపై హీరో మాట్లాడుతూ చదువు లేని వాడిని అని, ఆటో డ్రైవర్ ని అని, అలాంటి తనకి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన మాటలు ఎలా వస్తాయి అని చెప్తాడు. ఇది నిజమే కదా? కానీ డైరెక్టర్ ఇచ్చిన ఈ జస్టిఫికేషన్ వదిలేసి, హీరో తిట్టిన పదాన్ని మాత్రమే హైలైట్ చేసి దాని వీడియో పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది.

నిజంగా మనకి సామాజిక బాధ్యత ఉంది, అందుకే సినిమాల్లో ఇలాంటివి ఉండద్దు అని అంటున్నాం అని అనుకుందాం. కానీ తర్వాత వచ్చిన వీడియో ఈ అభిప్రాయాన్ని మార్చేస్తుంది ఏమో. ఇంటర్వెల్ కి ముందు హీరోయిన్ చేసిన ఒక పని తర్వాత, హీరోయిన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అంతకుముందు హీరో తిట్టిన బూతు పదాన్ని ఆడియన్స్ గట్టిగా అరుస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. పెద్ద హీరోల సినిమాల్లో హీరో ఎంట్రీకి ఎంత గట్టిగా అరుస్తూ రెస్పాన్స్ ఉంటుందో, అంత సౌండ్ తో తెరపై కనిపిస్తున్న ఒక అమ్మాయి పాత్రని అంత సభ్యకరమైన బూతు తిట్టారు.

మరి హీరో ఒక అమ్మాయిని తిట్టినప్పుడు అంత కోపం వచ్చింది, స్క్రీన్ మీద కనిపించే అమ్మాయి పాత్రని ఈ మాట మాత్రం మనం అనొచ్చా? సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే చాలా కామెంట్స్ థియేటర్లో ఒకరు ఇది చూసి నా కథ అన్నారు అని, మరొకరు చూసి హీరోయిన్ వచ్చినప్పుడు నా పక్కన సీట్ లో ఉన్నవాడు ఈ మాట తిట్టాడు అని, ఒకరు ఏమో అందులో నన్ను మోసం చేసిన అమ్మాయిని చూసుకున్నా అని, ఇంకొకరు అయితే అమ్మాయిలు అందరూ అంతే అని చాలా కామెంట్స్ ఇవే ఉన్నాయి.

అంతే కాకుండా ఈ సినిమాలో దర్శకుడు కేవలం హీరోయిన్ ని మాత్రమే కాదు, హీరోలో ఉన్న తప్పులని కూడా అంతే స్పష్టంగా చూపించారు. అసలు హీరోయిన్ అడగకుండానే హీరో ఆమె కోసం గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చాలా చేస్తాడు. అలాగే కొన్ని పనులు ఆలోచించకుండా చేస్తాడు. తన తప్పు ఏమీ లేదు ఆ అమ్మాయే తనని మోసం చేసింది అన్నంతగా బాధపడతాడు. అసలు హీరో ఆలోచన విధానం ఎక్కడ ఉందో, అసలు తను చేసే పని మీద తనకి క్లారిటీ అయినా ఉందా లేదా, తన మీద తనకి కంట్రోల్ లేకుండా హీరో ప్రవర్తించిన తీరు అనే విషయాలని కూడా దర్శకుడు చాలా బాగా చూపించారు.

కానీ అది సినిమా చూసిన వారిలో చాలా తక్కువ మందికి అర్థం అయ్యింది. సినిమాలో చూపించిన పాత్రలు ఎలా ఉన్నాయి, దర్శకుడు ఎలాంటి తప్పులు చేశారు అనే విషయం పక్కన పెడితే అసలు ఇలాంటి సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ రియాక్షన్ వీడియోలు అని ఇలాంటి అసభ్యకరమైన పదాలు వాడుతున్న థియేటర్ రెస్పాన్స్ చూసినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కదా కనిపిస్తుంది? దాంతో ఇప్పుడు ఈ విషయంపై కూడా కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి.

సినిమాలో హీరో తిట్టినప్పుడు చాలా మంది స్పందించి ఇది తప్పు అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఈ విషయంపై స్పందించి ఇలా అన్న వారిపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇదంతా చూసినప్పుడు సినిమా వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియదులే కానీ, మనలో చాలా లోపాలు ఉన్నాయి అనే విషయం మాత్రం అర్థం అవుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా వాళ్ళని ప్రశ్నించే ముందు ఇలాంటి సెన్సిబుల్ విషయాలని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ సినిమా చూసే ప్రేక్షకులకు రావాలి.


కాలిఫోర్నియాలో జులై 20న జరుగనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ అడుగుపెట్టనున్న మొదటి ఇండియన్ మూవీగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించబోతుంది. ఈ వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్-కే అర్ధం ఏమిటనే ఇంట్రెస్ట్ అందరిలోనూ మరింతగా పెరిగింది. అది మాత్రమే కాకుండా మూవీ మేకర్స్ సైతం ప్రాజెక్ట్-కే అంటే తెలుసుకోవాలని ఉందా? అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్ట్-కే అంటే ముందుగా కర్ణ, కల్కీ అనే టైటిల్స్ వైరల్ గా మారాయి. కానీ ప్రస్తుతం మాత్రం ప్రాజెక్ట్ కే మూవీకి ‘కాలచక్ర’ అని ఫైనల్ చేశారని వినిపిస్తోంది.
సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యం బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో ‘కాలచక్ర’ అనే టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. మరి టైటిల్ ఇదేనా కాదో తెలియాలంటే జులై 20 వరకు వేచి చూడాల్సిందే. ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోనే, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని తెలుస్తోంది.
బేబీ మూవీలో వైష్ణవి చైతన్య నటనతో ఆడియెన్స్ ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది. మూవీ కూడా చాలా సహజంగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల మీడియాలో బేబీ మూవీ రిలీజ్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు కూడా చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు ఆలయాలను దర్శిస్తూ, అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అమీన్ పీర్ దర్గాను సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. ఆ తరువాత కాణిపాకం చేరుకుని కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని, పూజలు నిర్వహించాడు. అక్కడి నుంచి సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తికి వెళ్లాడు.
సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామికి సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇచ్చారు. ప్రస్తుతం అది వివాదాస్పదంగా మారింది. శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్య స్వామికి పూజారి తప్ప వేరే వ్యక్తులు ఎవరు కూడా హారతిని ఇవ్వకూడదట. హీరో అయితే హారతి ఇవ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని గుడి అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఎలా హారతి ఇస్తాడని అతని పై కొందరు మండిపడుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత అంతగా బయటకు రాలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఇది తనకు పునర్జన్మ అని, భగవంతుడు పునర్జన్మ ప్రసాదించారని, అందుకే ఆలయాలను సందర్శించి, పూజలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు.
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రైలర్ తో ఇప్పటికే వావ్ అనిపించిన మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా పై హైప్ పెంచుతూ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలతో ఈ మూవీ మరింత క్రేజ్ పెరిగింది. దాంతో ఈ సిరీస్ నుండి కొత్త మూవీ వస్తున్న ప్రతిసారి ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. దానికి తగినట్టుగా మిషన్ ఇంపాజిబుల్ 7 వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. ఈ మూవీకి ఇండియాలో కూడా ఎక్కువ థియేటర్లు లభించాయని తెలుస్తోంది.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, సముద్రంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్ లో ప్రపంచానికి చెడు చేసే ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాన్ని కనిపెట్టాలంటే 2 భాగాలు ఉన్న తాళం చెవి కావాలి. ఆ తాళం చెవిని వెతికే బాధ్యతను ప్రభుత్వ ఆఫీసర్లకి అప్పగిస్తుంది. వారితో పాటు హంట్ (టామ్ క్రూజ్) కూడా రంగంలోకి దిగుతాడు. కీ వెతికే సమయంలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ఫైనల్ కీని ఎలా సంపాదిస్తారు అనేది కథ.
మూవీ సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సన్నివేశాలతో నడిపించారు. స్టోరీ పరంగా గొప్పగా ఏమీ లేకపోయినా యాక్షన్ లవర్స్ కోరుకునే సీన్స్ మాత్రం అభిమానులని చాలా ఇంప్రెస్ చేస్తాయి. యాక్షన్ ప్రియులను మెప్పించేలా మూవీ ఉన్నా లెంగ్త్ ఎక్కువయిన భావన వస్తుంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేట్టు ఉంది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా మూవీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు.
తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లలో 6వ సీజన్ తప్ప మిగిలిన సీజన్స్ అన్ని రికార్డ్ స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ ని పొంది సూపర్ హిట్ అయ్యాయి. అతి త్వరలోనే 7వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా హోస్ట్ హీరో అక్కినేని నాగార్జునే అని తెలుస్తోంది. రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
ఈ ప్రోమోని త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నారట. ఇక సీజన్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో చాలా కఠినమైన రూల్స్ ఉండబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్స్ కొన్ని సందర్భాలలో హద్దులు దాటి మరి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నోటి నుండి పొరపాటున బ్యాడ్ వర్డ్ ఒక్కటి బయటికి వచ్చినా సరే ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి షో నుండి బయటకి పంపేస్తారట.
అది మాత్రమే కాకుండా బిగ్ బాస్ 5వ సీజన్ లో షణ్ముఖ్, సిరల రొమాన్స్ బిగ్ బాస్ షో చూసే ఆడియెన్స్ కు ఎంత ఇబ్బంది కలిగించిందో తెలిసిందే. ఇక ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. అందువల్ల సీజన్ 7లో అలాంటి రొమాన్స్ జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. హద్దులు దాటి రొమాన్స్ చేసిన వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిస్తారని టాక్ వినిపిస్తోంది.
స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. దాని వల్ల వారు బయటికి రావడం అంత సులభం కాదు. వారికి సెక్యూరిటీ ఉండాలి. అందులోనూ నమ్మకమైన బాడీ గార్డు కూడా ఉండాలి. రక్షణ కవచం వలె పని చేసే బాడీ గార్డులకు స్టార్ హీరోలు వారి రేంజ్లో జీతాలు ఇస్తున్నారు. వేలల్లో, లక్షల్లో కాదు. వారి ఏడాది జీతం కోటల్లో ఉందంటే ఆశ్చర్యపోక మానరు. వీరి జీతం చిన్న హీరోలలో కొందరి రెమ్యూనరేషన్ తో సమానం.
అందరి కన్నా ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్ రవి సింగ్. ఇతను బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ బాడీగార్డు. రవి సింగ్ నెల జీతం దాదాపు రూ.17 లక్షలు, అంటే సంవత్సరానికి రూ.2.7 కోట్ల పైనే సంపాదిస్తున్నాడు. అతని తరువాతి స్థానంలో ఉన్న బాడీగార్డు షేరా, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్. షేరా సుమారు 29 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ దగ్గరే బాడీ గార్డుగా ఉన్నాడు. షేరా నెల శాలరీ రూ.15 లక్షలు, అంటే ఏడాదికి రెండు కోట్ల అని తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ బాడీగార్డు శ్రేయ్‌సే థెస్లె సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కు బాడీగార్డుగా పనిచేసిన జితేంద్ర షిండే ఏడాదికి రూ.1.5 కోట్లు జీతం తీసుకున్నాడు. ఆరేళ్ల పాటు అమితాబ్ బాడీగార్డ్ పని చేసి 2021 ఆగస్టు తర్వాత మానేశాడు. ఆమిర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడేకి సంవత్సరానికి రెండు కోట్లు జీతం అని తెలుస్తోంది. దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్ కి ఏడాదికి రూ.1.2 కోట్లు, అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్ ఏడాదికి రూ.1.2 కోట్లు జీతం తీసుకుంటునట్లు తెలుస్తోంది.



