సినీ రంగం అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండదు. ఈ ఇండస్ట్రీలో ఒకరు ఓవర్ నైట్ స్టార్ కావచ్చు. అలాగే ఒక్కసారిగా కింద పడిపోవడం కూడా జరుగవచ్చు. అలాంటి పరిస్థితిలోనే స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు లక్కీ హీరోయిన్ గా పేరుపొందిన పూజ హెగ్డే ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఒక యంగ్ టాలీవుడ్ హీరోతో కలిసి నటించేందుకు పూజా హెగ్డే అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పూజాహెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాల ఆఫర్లు రావడంతో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ పూజాహెగ్డే వరుసగా హిట్లను అందుకుంది. ఇక డైరెక్టర్లకు కూడా పూజాహెగ్డే లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అలా మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది.
అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పూజాహెగ్డే నటించిన 5 సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దాంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగిన తరువాత ఆమె ఆ మూవీ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పూజాహెగ్డే తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో పూజాహెగ్డే ఒక యంగ్ హీరోతో నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. ‘విరూపాక్ష’మూవీతో విజయం సాధించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో పూజహెగ్డే నటిస్తోందని తెలిసింది. ఈ మూవీని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించనున్నారు. దర్శక నిర్మాతలు ఈ మూవీ కోసం ఇప్పటికే పూజాహెగ్డేను సంప్రదించారని, పూజా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికార ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.
Also Read: వైష్ణవి చైతన్య “బేబీ” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో ఆడియెన్స్ ని పలకరించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబి’ తో ఆడియెన్స్ ముందుకి మరోసారి రాబోతున్నాడు. ఈ సినిమాని సాయిరాజేష్ నీలం తెరకెక్కించాడు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా, యాక్టర్ విరాజ్ అశ్విన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ మూవీ రిలీజ్ కు ముందే హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పై చాలా బజ్ క్రియేట్ అయ్యింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. జులై 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ జరిగే సమయంలో ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో ఆ డైలాగులను మ్యూట్ చేయాలని సెన్సార్ చిత్రబృందాన్ని కోరినట్టు తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా కొన్ని విజువల్స్ ని కట్ చేశారని సమాచారం.
ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకి ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీని అందరు ఒక మిడిల్ క్లాస్ యువకుడి లవ్ స్టోరి అని అనుకున్నారు. అయితే తాజాగా బేబీ సినిమా సెన్సార్ అప్ డేట్ గురించి తెలియడంతో అభిమానులు కంగారుపడుతున్నారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సౌందర్య ఈ మూవీలో హీరోయిన్ పాత్ర లో నటించగా రమ్యకృష్ణ మాత్రం నెగిటివ్ రోల్ చేసింది. ఆనాడు రమ్యకృష్ణకు మంచి నటిగా మరింత పేరు తెచ్చిన పాత్రల్లో ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ ఉంటుంది.
రమ్యకృష్ణ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి నుండి తెలుసని రవికుమార్ చెప్పుకొచ్చారు. అయితే రమ్యకృష్ణ, సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేయాలని చెప్పగానే రమ్యకృష్ణ మాత్రం ఆ సీన్ చేయనని రవి కుమార్ కు చెప్పరట. అయితే సౌందర్య మార్కెట్ ఎక్కువ అని నా మార్కెట్ తక్కువ అని రమ్యకృష్ణ చెప్పారట. కానీ సౌందర్య మాత్రం నువ్వే చెయ్యాలి.
అంటూ ఆమె కాళ్లు తన ముఖం పై పెట్టుకున్నారని కె.ఎస్.రవికుమార్ వెల్లడించారు. కానీ రమ్య కృష్ణ ఆ సమయంలో ఏడ్చారని కామెంట్ చేశారు. ఆ షాట్ రియల్ అని కె.ఎస్.రవికుమార్ తెలియజేశారు. అందులో రమ్యకృష్ణ సౌందర్య నటించారని డుప్ ఏమీ లేదని రవికుమార్ అన్నారు. ఈ మూవీ కె.ఎస్.రవికుమార్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఆయన అన్నారు.
వారసుడు మూవీ తరువాత స్టార్ హీరో విజయ్ దళపతి మరో తెలుగు దర్శకుడితో చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ దర్శకుడే గోపీచంద్ మలినేని. ఈ ఏడాది వీరసింహారెడ్డితో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ హీరో విజయ్ ను కలిసి కథ వినిపించించారని, మొదటి సిట్టింగ్‌లోనే విజయ్ కథను ఓకే చేశారని టాక్ వచ్చింది. గోపీచంద్ చెప్పిన స్టోరీ విజయ్‌కి బాగా నచ్చిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరి కాంబో పై అధికారిక ప్రకటన వస్తుందని అంతా భావించారు.
కానీ, అదే టైంలో విజయ్ దళపతి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో మూవీని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. గోపీచంద్ తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభు విజయ్‌కి స్టోరి వినిపించారు. దాంతో గోపీచంద్ చెప్పిన స్టోరి పక్కన పెట్టారు. కారణం ఏమిటా అని ఆరా తీసిన తమిళ మీడియా వార్తల ప్రకారం, వచ్చే రెండు ఏళ్లలో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.
వెంకట్ ప్రభు చెప్పిన కథలో లోకల్ కంటెంట్ మరియు స్థానిక రాజకీయాల గురించి ప్రస్తావన ఉంటుందట. అందుకే ఈ కథను ఒకే చేశారని, ఈ మూవీని వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసి, ఆ తర్వాత పాలిటిక్స్ వైపు వస్తారని అంటున్నారు. ఇటీవల విజయ్ మూడేళ్ళ పాటు సినిమాలకు విరామం ఇస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా జవాన్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రివ్యూ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 12సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని జాగ్రత్తగా, స్టోరీ అంతగా అర్ధమయ్యే అవకాశం ఇవ్వకుండా గ్రాండ్ విజువల్స్ తో ఎడిట్ చేశారు. షారుఖ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్ లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన వెర్షన్లు పెట్టారు.
‘ఎవరు నేను, ఏవరిని కాను, తెలియదు. తల్లికిచ్చిన మాట కావచ్చు. నేరవేరని లక్ష్యం కావచ్చు’ అంటూ మొదలైన ప్రివ్యూ ఆద్యంతం షారుక్ డైలాగ్స్, లుక్స్, యాక్షన్ తో ఆకట్టుకుంది. ఇందులో షారుక్ పోలీస్ డ్రెస్ లో, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. ఇక చివర్లో గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచారు. ‘ఇది ఆరంభం మాత్రమే’ మరియు ‘నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు’ అని చెప్పే షారుక్ డైలాగ్స్ ప్రివ్యూకి హైలైట్ గా నిలిచాయి.
విజయ్ సేతుపతి లుక్ బాగుంది. అయితే ఆయన పాత్రని రివీల్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె యాక్షన్ షాట్ బాగుంది. స్టైలిష్ ఆఫీసర్ గా నయనతారను చూపించారు. ఇది ఇలా ఉంటే జవాన్ ట్రైలర్ ప్రివ్యూ పై సోషల్ మీడియాలో లు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.




అయితే వీరసింహారెడ్డి సమయంలోనే గోపీచంద్ మలినేని సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్టోరీ చెప్పడం జరిగిందట. గోపీచంద్ తరువాతి మూవీ మైత్రి వారితోనే చేయాలి. మహేష్ బాబు వద్ద మైత్రి మేకర్స్ అడ్వాన్స్ ఉంది. అయితే మహేష్ బాబు కాల్ షీట్స్ మాత్రం ఇప్పట్లో ఖాళీ లేకపోవడంతో గోపీచంద్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేయాలని ప్రయత్నించాడు. ఎందుకంటే విజయ్ దగ్గర కూడా మైత్రి మేకర్స్ అడ్వాన్స్ ఉంది. కానీ అతను ఒప్పుకోలేదు.
చివరకు గోపీచంద్ మలినేని తనకు హ్యట్రిక్ హిట్స్ ఇచ్చిన రవితేజతోనే ఫిక్స్ అయ్యాడు. గోపీచంద్ మలినేని తరువాతి సినిమా రవితేజతో అని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు విజయం సాధించాయి. దాంతో వీరి కాంబో పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
కొత్త మూవీ కానీ, ట్రైలర్, పోస్టర్, టీజర్ ఇలా ఏది రిలీజ్ అయిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించే నెటిజెన్లు ఈ ప్రివ్యూలో ఉన్న షారుక్ లుక్స్, సీన్స్ వేరే సినిమాల నుండి తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా జవాన్ ట్రైలర్ ప్రివ్యూలోని లుక్స్ ను ఎక్కడి నుండి తీసుకున్నారో ఆ ఫోటోలను కలిపి షేర్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.
బాహుబలి మూవీలో రమ్యకృష్ణ నీటిలో మునుగుతూ చిన్న బాబును రెండు చేతులతో ఎత్తిపట్టుకుంటుంది. జవాన్ ప్రివ్యూలో అలాంటి సీన్ కనిపించింది. మరో సీన్ బైక్స్ పై వచ్చే సీన్, అజిత్ నటించిన వలిమైలో ఇలాంటి సీన్ ఉంటుంది. అపరిచితుడు విక్రమ్ లుక్, హాలీవుడ్ డార్క్ మ్యాన్ మరియు డార్క్ నైట్ సినిమాలలోని లుక్, శివాజీ మూవీలో రజనీకాంత్ గుండుతో కనిపిస్తాడు. అచ్చం అలాగే ట్రైలర్ ప్రివ్యూ చివర్లో లుక్ లో అలాంటి లుక్స్ లో షారుక్ కనిపించాడు. దాంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమాలో ఇన్ని పెట్టరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



రెండు పార్టులుగా ప్లాన్ చేసిన పుష్ప ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ టైటిల్ తో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా అల్లు అర్జున్ లుక్, యాక్షన్, సాంగ్స్, హీరో మేనరిజమ్ లాంటివన్నీ బాగా పాపులర్ అయ్యాయి. పుష్ప ది రైజ్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ లో నటించింది. ‘ఊ అంటావా మావ’సాంగ్ తో సమంత మెప్పించింది. అలాగే ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
ఇక ఇప్పుడు ‘పుష్ప 2 ది రూల్’లో ఊ అంటావా సాంగ్ ను మించే విధంగా ఐటెం సాంగ్ ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటిలాగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో పుష్ప 2 మూవీలోని ఐటమ్ సాంగ్‌కి మంచి ట్యూన్ ఇచ్చారని, ఆ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా నర్తించనుందని కొన్ని రోజుల ముందు టాక్ వచ్చింది. అయితే తాజాగా పుష్ప 2 మూవీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఐటెమ్ సాంగ్ చేయడం కోసం ఊర్వశీ రౌతేలా రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.