సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు మాస్ లో కూడా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు మొదటిసారి పక్కా మాస్ ఓరియంటెడ్ గుంటూరు కారం చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్నారు. మాటల మాంత్రికుడు మరియు సూపర్ స్టార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
దీనితో పాటుగా మహేష్ బాబు రాజమౌళితో మరో చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జక్కన్న మహేష్‌కు తనదైన శైలిలో స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశారట. మరి జక్కన్న మూవీ అంటే హీరోకి ఆ మాత్రం హోంవర్క్ కామనే కదా. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక సినిమా తీసుకున్నాడు అంటే రోజులు వారాలు ,వారాలు నెలలు ,నెలలు సంవత్సరాలుగా ఎప్పుడు మారుతాయో యాక్టర్స్ కి కూడా తెలియదు. పర్ఫెక్షన్ వస్తే తప్ప ఏ సీన్ ను ఒప్పుకొని రాజమౌళి సంగతి ఇంతకుముందు అతనితో పని చేసిన ఎందరో స్టార్ హీరోలు ఇంటర్వ్యూలో పేర్కొని ఉన్నారు.

హీరోలకు వంద కండిషన్లు పెట్టి మూవీ మొదలు పెడతాడు జక్కన్న. హీరో లుక్ బయటికి రాకూడదు, సినిమా పూర్తి అయ్యేంతవరకు ఎక్కువగా ఈవెంట్స్ కి వెళ్ళకూడదు, మరో చిత్రంలో అస్సలు నటించకూడదు…ఇలా జక్కన్న పండంటి చిత్రానికి 12 పైనే కండిషన్స్ ఉంటాయి.

అంతేకాకుండా సినిమాలో జరగబోయే యాక్షన్ సన్నివేశాల కోసం హీరోకు ముందుగానే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బాహుబలి లో బాహుబలి, కట్టప్ప ,బల్లాలదేవుడు లాంటి యుద్ధ సన్నివేశాలైన ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చేసిన ఫీట్ అయిన థియేటర్లో చూస్తుంటే ఆడియన్స్‌కి ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఎన్నో కసరత్తులు చేసి వాళ్లు ఆ సీన్ చేస్తారు కాబట్టి.

అయితే రాబోయే తన చిత్రం కోసం మహేష్ బాబుకు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు అంటే ముచ్చటగా మూడు నెలలు ట్రైనింగ్ సెక్షన్ ఉండబోతుంది. జక్కన్న ట్రైనింగ్ అంటే మామూలుగా ఉండదు అందుకే మహేష్ బాబు ముందు జాగ్రత్తగా త్రివిక్రమ్ ను గుంటూరు కారం సినిమాను నవంబర్ లోపు పూర్తి చేయమని కండిషన్ పెట్టినట్టు టాక్.
ఎంకి పెల్లి సుబ్బి చావుకు వచ్చిందని రాజమౌళి ట్రైనింగ్ త్రివిక్రమ్ సినిమాకు టైం బోంబ్లా తయారయింది.

రెండు పార్టులుగా ప్లాన్ చేసిన పుష్ప ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ టైటిల్ తో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా అల్లు అర్జున్ లుక్, యాక్షన్, సాంగ్స్, హీరో మేనరిజమ్ లాంటివన్నీ బాగా పాపులర్ అయ్యాయి. పుష్ప ది రైజ్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ లో నటించింది. ‘ఊ అంటావా మావ’సాంగ్ తో సమంత మెప్పించింది. అలాగే ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
ఇక ఇప్పుడు ‘పుష్ప 2 ది రూల్’లో ఊ అంటావా సాంగ్ ను మించే విధంగా ఐటెం సాంగ్ ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటిలాగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో పుష్ప 2 మూవీలోని ఐటమ్ సాంగ్‌కి మంచి ట్యూన్ ఇచ్చారని, ఆ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా నర్తించనుందని కొన్ని రోజుల ముందు టాక్ వచ్చింది. అయితే తాజాగా పుష్ప 2 మూవీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఐటెమ్ సాంగ్ చేయడం కోసం ఊర్వశీ రౌతేలా రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ, ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కానీ కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఎలాంటి అంచలనాలు లేని ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సీనియర్ నరేష్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో ఉన్న ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ మూవీ శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న హీరో శ్రీవిష్ణు కాదంట. యంగ్ హీరో సందీప్ కిషన్ అట. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ మూవీని సందీప్ తో చేయాలని అనుకుంటే ఆ సమయంలో సందీప్ మైఖేల్ మూవీతో బిజీగా ఉండి, ఈ సినిమాకి నో చెప్పారట. అలా ఈ సినిమా శ్రీవిష్ణు దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. సందీప్ ఒక సూపర్ హిట్ సినిమాను ను మిస్ అయ్యాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘సలార్’. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ తో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. సలార్ టీజర్ పై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు అగ్నిహోత్రి తన ట్వీట్లో ‘ఎవరు హింసాత్మకంగా పుట్టరు. పిల్లల మనసులను శాంతి వైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ సెలెబ్రెటీలు, ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లోని హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు. ఇటువంటి హింసాత్మక లోకంలో సృజనాత్మక స్పృహ ఒకటే పరిష్కారం’ అని తెలిపారు.
ఆ ట్వీట్ కి కొనసాగింపుగా, ‘ప్రస్తుతం చిత్రాలలో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, అలాగే అర్థంలేని చిత్రాలను ప్రమోట్ చేయడాన్ని ప్రతిభగా పరిగణిస్తున్నారు. అసలు యాక్టర్ కాని వ్యక్తిని అతి పెద్ద స్టార్‌గా ప్రమోట్ చేయడం అనేది అతిపెద్ద ప్రతిభగా గుర్తిస్తున్నారు. ఇక ఆడియెన్స్ కి ఏమి తెలియదని అనుకోవడం అన్నింటికంటే బిగ్గెస్ట్ టాలెంట్ అని అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ లో సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం జూన్ 16న విడుదల అయ్యింది. మొదటి షో నుండే మూవీలో పాత్రల ఆహార్యం పై, డైలాగ్స్ పై నెటిజన్లు, ఆడియెన్స్ సినిమాపై, దర్శకుడు ఓం రౌత్ పై తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ చేశారు.
ఈ చిత్రంలోని హనుమంతుడు చెప్పే డైలాగ్స్ తప్పుగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆదిపురుష్ యూనిట్ పై, రచయిత నెటిజెన్లు మండిపడ్డారు. ఆ డైలాగ్స్ పై పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. పలు కోర్టులలో పీటీషన్లు కూడా వేశారు. బ్యాన్ చేయాలనే నిరసనలు చేశారు. మొన్నటివరకు ఈ డైలాగ్స్ ని రాసిన రైటర్ మనోజ్ శుక్ల సమర్ధించుకున్నాడు. ఆ తరువాత అతని పై మరింత ట్రోలింగ్ పెరిగింది.
మనోజ్ శుక్ల మనోజ్ ముతాంషీర్ పేరుతో కూడా చాలా గుర్తుంపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతా నుండి ట్వీట్ చేశారు. అందులో, “ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి మీకు క్షమాపణలు చెప్తున్నాను. ప్రభు బజరంగ్ బలి మనందరినీ ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన ధర్మానికి, మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలి అని వేడుకుంటున్నాను”. అని మనోజ్ శుక్ల రాసుకొచ్చారు.
రాకేష్ మాస్టర్ ఇంటికి వంట చేయడం కోసం వచ్చిన లక్ష్మిని మాస్టర్ తన భార్యగా అందరికి చెప్పిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ లక్ష్మితో సరదాగా మాట్లాడుతూ, తనతో సహజీవనం చేస్తున్నానని ఆయన గతంలో తన యూట్యూబ్ ఛానెల్ వీడియోలలో చెప్పారు. అయితే, ఆ యూట్యూబ్ ఛానెల్‌ను రాకేష్ మాస్టర్ నుండి లక్ష్మి లాక్కున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మి రాకేష్ మాస్టర్‌తో 3 సంవత్సరాలు సహజీవనం చేసిన తరవాత వారిద్దరూ గొడవలతో విడిపోయారని తెలుస్తోంది.
రాకేష్ మాస్టర్ నుంచి లాక్కున్న ఛానెల్ కోసం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ప్రయత్నిస్తున్నారని, వారికి యూట్యూబర్ లల్లీ హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మికి, లల్లీకి, మధ్య గొడవలు అవుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు లక్ష్మి స్కూటర్ పై వెళ్తున్న సమయంలో అడ్డగించి లల్లీ, ఇంకో నలుగురు మహిళలు లక్ష్మి పై దాడి చేశారని, ఇష్టం వచ్చినట్టుగా చితక్కొట్టారని, ఆ సమయంలో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లక్ష్మిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఆమె తనపై దాడి చేసిన వారి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత మీడియాతో లక్ష్మీ ఇలా చెప్పుకొచ్చారు. ‘తనను 2 నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇవాళ తన మీద దాడి చేశారని, నెల్లూరు భారతి అనే మహిళ ఇలా చేయించిందని ఆరోపించారు. తన యూట్యూబ్ ఛానెల్ ను వదిలివేయాలని కొన్ని రోజుల నుండి బెదిరిస్తున్నారు. తన పై దాడి చేసిన వారిలో లల్లీ, పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి, దుర్గ, మరో మహిళ ఉన్నారు’ అని వెల్లడించారు.