సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరో లకు సంబంధించి వారి కొడుకులు కూతుర్లు మాత్రమే మళ్లీ సినిమాల్లోకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ టాప్ హీరోయిన్లు వారి కొడుకులు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ టాప్ హీరోయిన్ తల్లులు ఎవరు.. వీరి తనయులు కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చారు.. వారెవరో ఓసారి చూద్దాం..!!
#1 రోజారమణి తరుణ్
హీరో తరుణ్ అంటే తెలియనివారుండరు.. అయితే ఆయన తల్లి రోజా రమణి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఒరియాలో కూడా హీరోయిన్ గా పేరు పొందారు.

#2 అమల అక్కినేని
అక్కినేని అమల ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు. ఆమె కొడుకు అఖిల్ కూడా హీరోగా చేస్తున్నారు.

#3నర్గీస్ దత్ – సంజయ్ దత్
హీరోయిన్ మరియు హీరో తనయుడు సంజయ్ దత్.. ప్రస్తుతం ఈయన అనేక సినిమాలు చేస్తున్నారు.

#4 జయసుధ శ్రేయన్
తెలుగు ఇండస్ట్రీలో సహజనటిగా పేరు సంపాదించిన జయసుధ కొడుకు శ్రేయాన్.. ఈయన కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు.

#5 జయా బచ్చన్ – అభిషేక్ బచ్చన్
జయా బచ్చన్ మరియు అమితాబ్ బచ్చన్ ల కుమారుడు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్లో టాప్ హీరో గా కొనసాగుతున్నారు.

#6 షర్మిల ఠాగూర్ – సైఫ్ అలీ ఖాన్
మున్సుర్ అలీ ఖాన్ పటౌడీ మరియు షర్మిల ఠాగూర్ కుమారుడు సైఫ్ ఆలీ ఖాన్.. ఈయన బాలీవుడ్లో హీరోగా చేస్తున్నాడు.

#7 వైజయంతిమాల బాలి సుచింద్ర బాలి
ఒకప్పుడు బాలీవుడ్ లో అగ్ర కథానాయిక వైజయంతిమాల బాలి తనయుడు సూచింద్ర బాలి.. తమిళం మరియు హిందీ ఇండస్ట్రీ లో కొన్ని చిత్రాల్లో నటించాడు.

#8 నీతూ కపూర్ రన్బీర్ కపూర్
నీతూ సింగ్ రిషి కపూర్ ల ముద్దుల కుమారుడు రన్బీర్.. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు.

#9 కరణ్ కపాడియా – సింపుల్ కపాడియా
డింపుల్ కపాడియా యొక్క చెల్లెలు సింపుల్ కపాడియా కొడుకు కరణ్ కపాడియా ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.









#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ, ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కానీ కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఎలాంటి అంచలనాలు లేని ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సీనియర్ నరేష్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో ఉన్న ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ మూవీ శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న హీరో శ్రీవిష్ణు కాదంట. యంగ్ హీరో సందీప్ కిషన్ అట. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ మూవీని సందీప్ తో చేయాలని అనుకుంటే ఆ సమయంలో సందీప్ మైఖేల్ మూవీతో బిజీగా ఉండి, ఈ సినిమాకి నో చెప్పారట. అలా ఈ సినిమా శ్రీవిష్ణు దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. సందీప్ ఒక సూపర్ హిట్ సినిమాను ను మిస్ అయ్యాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘సలార్’. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ తో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. సలార్ టీజర్ పై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు అగ్నిహోత్రి తన ట్వీట్లో ‘ఎవరు హింసాత్మకంగా పుట్టరు. పిల్లల మనసులను శాంతి వైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ సెలెబ్రెటీలు, ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లోని హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు. ఇటువంటి హింసాత్మక లోకంలో సృజనాత్మక స్పృహ ఒకటే పరిష్కారం’ అని తెలిపారు.
ఆ ట్వీట్ కి కొనసాగింపుగా, ‘ప్రస్తుతం చిత్రాలలో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, అలాగే అర్థంలేని చిత్రాలను ప్రమోట్ చేయడాన్ని ప్రతిభగా పరిగణిస్తున్నారు. అసలు యాక్టర్ కాని వ్యక్తిని అతి పెద్ద స్టార్‌గా ప్రమోట్ చేయడం అనేది అతిపెద్ద ప్రతిభగా గుర్తిస్తున్నారు. ఇక ఆడియెన్స్ కి ఏమి తెలియదని అనుకోవడం అన్నింటికంటే బిగ్గెస్ట్ టాలెంట్ అని అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ లో సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం జూన్ 16న విడుదల అయ్యింది. మొదటి షో నుండే మూవీలో పాత్రల ఆహార్యం పై, డైలాగ్స్ పై నెటిజన్లు, ఆడియెన్స్ సినిమాపై, దర్శకుడు ఓం రౌత్ పై తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ చేశారు.
ఈ చిత్రంలోని హనుమంతుడు చెప్పే డైలాగ్స్ తప్పుగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆదిపురుష్ యూనిట్ పై, రచయిత నెటిజెన్లు మండిపడ్డారు. ఆ డైలాగ్స్ పై పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. పలు కోర్టులలో పీటీషన్లు కూడా వేశారు. బ్యాన్ చేయాలనే నిరసనలు చేశారు. మొన్నటివరకు ఈ డైలాగ్స్ ని రాసిన రైటర్ మనోజ్ శుక్ల సమర్ధించుకున్నాడు. ఆ తరువాత అతని పై మరింత ట్రోలింగ్ పెరిగింది.
మనోజ్ శుక్ల మనోజ్ ముతాంషీర్ పేరుతో కూడా చాలా గుర్తుంపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతా నుండి ట్వీట్ చేశారు. అందులో, “ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి మీకు క్షమాపణలు చెప్తున్నాను. ప్రభు బజరంగ్ బలి మనందరినీ ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన ధర్మానికి, మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలి అని వేడుకుంటున్నాను”. అని మనోజ్ శుక్ల రాసుకొచ్చారు.
రాకేష్ మాస్టర్ ఇంటికి వంట చేయడం కోసం వచ్చిన లక్ష్మిని మాస్టర్ తన భార్యగా అందరికి చెప్పిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ లక్ష్మితో సరదాగా మాట్లాడుతూ, తనతో సహజీవనం చేస్తున్నానని ఆయన గతంలో తన యూట్యూబ్ ఛానెల్ వీడియోలలో చెప్పారు. అయితే, ఆ యూట్యూబ్ ఛానెల్‌ను రాకేష్ మాస్టర్ నుండి లక్ష్మి లాక్కున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మి రాకేష్ మాస్టర్‌తో 3 సంవత్సరాలు సహజీవనం చేసిన తరవాత వారిద్దరూ గొడవలతో విడిపోయారని తెలుస్తోంది.
రాకేష్ మాస్టర్ నుంచి లాక్కున్న ఛానెల్ కోసం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ప్రయత్నిస్తున్నారని, వారికి యూట్యూబర్ లల్లీ హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మికి, లల్లీకి, మధ్య గొడవలు అవుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు లక్ష్మి స్కూటర్ పై వెళ్తున్న సమయంలో అడ్డగించి లల్లీ, ఇంకో నలుగురు మహిళలు లక్ష్మి పై దాడి చేశారని, ఇష్టం వచ్చినట్టుగా చితక్కొట్టారని, ఆ సమయంలో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లక్ష్మిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఆమె తనపై దాడి చేసిన వారి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత మీడియాతో లక్ష్మీ ఇలా చెప్పుకొచ్చారు. ‘తనను 2 నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇవాళ తన మీద దాడి చేశారని, నెల్లూరు భారతి అనే మహిళ ఇలా చేయించిందని ఆరోపించారు. తన యూట్యూబ్ ఛానెల్ ను వదిలివేయాలని కొన్ని రోజుల నుండి బెదిరిస్తున్నారు. తన పై దాడి చేసిన వారిలో లల్లీ, పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి, దుర్గ, మరో మహిళ ఉన్నారు’ అని వెల్లడించారు.




