ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఇంట్లో నుండే చూసేస్తున్నారు. ఓటీటీ కల్చర్ పెరిగినప్పటి నుండి ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు సినీ ప్రియులు బాగా అలవాటు పడిపోయారు. ప్రతి వారం వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో తాజాగా డిఫరెంట్ స్టోరీ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘స్వీట్ కారం కాఫీ’. మూడు తరాలకు చెందిన మహిళల కథగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మహిళల స్టోరీనే ఈ వెబ్ సిరీస్. కుటుంబంలోని ఆడవాళ్ళకి ఏం కావాలో తెలియని సగటు మనిషి రాజరత్నం. అతను ఇంట్లోని వారు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అతని తల్లి సుందరి (లక్ష్మి), భార్య కావేరి (మధు), కుమార్తె నివి (శాంతి) సంతోషంగా ఉన్నారని భావిస్తాడు. తల్లిని ఇంట్లోనే ఉంచి చిన్న పిల్లలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆమెకు ఎక్కడికైనా వెళ్లి గడపాలని కోరుకుంటుంది.
కుమార్తె క్రికెటర్ గా తన కెరీర్ ను, తనను గౌరవించే వ్యక్తి కోసం వెతుకుతుంటుంది. ఇక గృహిణి అయిన కావేరికి ఇళ్లే ప్రపంచం. కానీ భర్త, కొడుకు సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోతుంది. అలా ఈ మహిళలు ముగ్గురు ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతారు. వారు తమ జర్నీని ఎలా కొనసాగించారు? ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. నిజ జీవితంలో ప్రతిరోజూ తమ ఫ్యామిలీ కోసం త్యాగం చేసే ప్రతి మహిళ జీవితం గురించి ఈ సిరీస్ లో ప్రస్తావించారు. ముగ్గురు మహిళల పాత్రలను చక్కగా రాసుకున్నారు. వారి పాత్రలలో మనల్ని మనం ఊహించుకునేలా ఉన్నాయి. లక్ష్మి, మధుబాల ఇద్దరూ తమ పాత్రలలో జీవించారు. 7వ ఎపిసోడ్లో లక్ష్మి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. శాంతి చక్కగా నటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్స్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని దర్శకుడు టీజర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో ప్రభాస్ పూర్తి లుక్ ను చూపించలేదు. కానీ ఈ టీజర్ లో ప్రభాస్ గురించి ఎలివేషన్స్ ఇచ్చిన యాక్టర్ హైలెట్ గా నిలిచాడు.
అతను ఎవరో కాదు యాక్టర్ టీనూ ఆనంద్. అతనికి ప్రభాస్ తో ఇది రెండవ మూవీ. ప్రభాస్ ‘సాహో’ మూవీలో ఇతడు నటించాడు. అతను పలు తెలుగు సినిమాలలో నటించాడు. అయితే టీనూ ఆనంద్ తెలుగులో నటించిన మొదటి సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమా లో విలన్ గా నటించాడు. అతను భాటియా అనే క్యారెక్టర్ లో సరికొత్త విలనిజం పండించాడు.
అంతేకాకుండా గతేడాది రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించిన ‘సీతారామం’ మూవీలో కూడా నటించాడు. మూవీ మొదట్లో వచ్చే ఆనంద్ మెహతా అనే క్యారెక్టర్ లో కనిపించాడు. ఆయన కుటుంబంలోని వారంతా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టీనూ ఆనంద్ మేనల్లుడు అయిన సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టీనూ ఆనంద్ లో యాక్టర్ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు, నిర్మాతగా పని చేశాడు.
సలార్ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు రాత్రి నుంచే హడావుడి మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున రిలీజ్ అయిన టీజర్ నిరాశ పరిచిందని అంటున్నారు. ఇంతగా ఎదురు చేసింది మలయాళ హీరో పృథ్వి రాజ్ ను కోసం కాదని హీరో ప్రభాస్ ను చూడటం కోసమని అంటున్నారు. టీజర్ లో కనీసం ప్రభాస్ ఫుల్ ఫేస్ కూడా చూపించలేదని, సాహో సినిమా క్లైమాక్స్ షాట్స్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది సలార్ టీజర్ కన్నా ఉపేంద్ర కబ్జా టీజర్ బెటర్ అని అంటున్నారు. మ్యాడ్ మాక్స్ అనే ట్విట్టర్ యూజర్ సలార్ టీజర్ కన్నా కబ్జా టీజర్ బాగుందని ట్వీట్ చేశాడు. అలాగే కబ్జా టీజర్ ను కూడా యాడ్ చేశాడు. దీని పై ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ టీజర్లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా లేదు. ట్రైలర్ లో క్లియర్ గా చూపిస్తాడని కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు నెటిజెన్లు సలార్ టీజర్ కు బదులుగా మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే వరుస పరాజయాలతో నిరాశలో ఉన్నారు. ఈ మూవీ టీజర్ ఫ్యాన్స్ ను మరింత నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు. టీజర్ ఈ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అనుకుంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ రావడం బాగోలేదని చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆమె సినిమాలలో నటించకపోయినా, తన టాలెంట్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తన డ్యాన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు. ఇప్పటివరకు సితార ఇన్ స్టాగ్రామ్ లో 642 పోస్టులను మాత్రమే చేసింది. వాటితోనే ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పొందారు.
12 సంవత్సరాల సితార ఇటీవల జ్యువెలరీ యాడ్ యాడ్ లో నటించింది. ఆమె నటించిన ఈ యాడ్ సెన్సషన్ గా మారింది. ఈ జ్యువెలరీ యాడ్ ను న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సితార గురించి మహేష్ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉంటే ఈ యాడ్ లో నటించడం కోసం సితార అందుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సితార ఈ జ్యువెలరీ యాడ్ కి అందుకున్న రెమ్యునరేషన్ కోటి రూపాయలని సమాచారం. సితార భవిష్యత్తులో మరిన్ని ప్రకటనలలో కనిపిస్తారని తెలుస్తోంది.


తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్లో నెటిజెన్లు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను గుర్తించారు. దాంతో కేజీఎఫ్‌తో సలార్ మూవీకి కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో రాఖీ భాయ్ కూడా ఉంటారు అనే విషయానికి మరింతగా బలం చేకూరినట్టు అయ్యింది. ఇది ప్రభాస్ సలార్, రాఖీ భాయ్ మధ్య ఉన్న పెద్ద క్రాసర్ను సూచిస్తుంది.
సలార్ టీజర్ చూసిన అనంతరం కేజీఎఫ్-2 కు తప్పకుండా సంబంధం ఉందని అంటున్నారు. అది నిజమేనని చెప్పడానికి రెండు ఫోటోలను నెటిజెన్లు గుర్తించారు. కేజీఎఫ్-2, సలార్ టీజర్ కు సినిమాలకు సంబంధించిన 2 స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూస్తుంటే కేజీఎఫ్‌తో సలార్‌కు సంబంధం ఉందని అనిపిస్తుంది. చాలా రోజుల నుండి సలార్ మూవీలో రాఖీ భాయ్ పాత్ర కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈ సన్నివేశాలు ఉన్నాయి. టీజర్లో వీటికి సంబంధించిన క్లూస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. ఒక వేళ ఇదే నిజం అయితే ప్రభాస్, రాఖీ భాయ్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు. ప్రభాస్, యశ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు. ఒకరి మూవీ రిలీజ్ అయితేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. ఇక ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని టీజర్ చివరలో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అంటూ టీజర్ ఎండ్ లో వేశారు. ఇలా ఈ ఈ టీజర్ కేజీఎఫ్ తో రిలేటెడ్ గా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.



2020లో డిసెంబర్ లో నిహారిక, చైతన్య పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రాజస్థాన్ లో ఒక ప్యాలెస్ లో చాలా ఘనంగా జరిగింది. పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో సంతోషంగా కనిపించారు. వెకేషన్స్ కు వెళ్ళిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. నిహారిక, చైతన్యల వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారని అనుకునేలోపే షాక్ ఇచ్చారు.
నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నాము అంటూ తాజాగా ఒకరి తరువాత మరొకరు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. వీరికి గత నెల జూన్ 5న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆలస్యంగా కాస్త బయటికి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో వీరి గురించి ఎక్కువగా వార్తలు షికారు చేస్తున్నాయి. నిహారిక పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం అనంతరం చైతన్యను ఉద్దేశించి చేసిన పాత ట్వీట్ కూడా వైరల్ అయ్యింది.
నాగబాబు ఆ ట్వీట్ లో ‘ ప్రియమైన చై దాదాపు అన్ని విషయాలలోను తాను నాలాగే ఉంటుందని అందరు అంటుంటారు. ప్రపంచంలోని ప్రేమనంతా ఆమె పై కురిపిస్తావని నమ్ముతున్నాను. అలాగే ఈ రోజు నుంచి తను అధికారికంగా నీ సమస్యగా మారిపోయింది’ అని రాసుకొచ్చారు.
నిఖిల్ లేఖలో ‘స్పై మూవీకి నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను అందించారు. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దాంతో నా కెరీర్ లో నే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం బాధగాను ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాలలో వచ్చిన ఇబ్బందుల కారణంగా స్పై సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయలేకపోయాం.
ఆఖరికి ఓవర్సీస్లో సైతం 350 దాకా తెలుగు ప్రీమియర్ షోలు క్యాన్సల్ అయ్యాయి. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆడియెన్స్ కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నాను. ఎందుకంటే కార్తికేయ-2 మూవీతో మీ అందరికీ చేరువయ్యాను. అయితే స్పై మూవీని అందించలేకపోయాను. తర్వాత రాబోయే నా మూడు చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో తప్పకుండా అనుకున్న టైమ్ కి విడుదల అవుతాయని మాటిస్తున్నాను.
నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలుగు ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి మాటిస్తున్నాను. ఇప్పటి నుండి మూవీ కంటెంట్, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాను. నాపై ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తాను’ అని నిఖిల్ పేర్కొన్నాడు.