‘ఆదిపురుష్’ సినిమా పై విమర్శలు ఇప్పటికీ ఆగడం లేదు. డైరెక్టర్ ఔం రౌత్ ఈ సినిమాను ఏ సమయంలో ప్రారంభించాడో కానీ ఈ మూవీ మొదటి నుండి విమర్శల పాలవుతునే ఉంది. సామాన్యుల నుండి సినీ, రాజకీయ ప్రణుఖుల వరకు మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ చిత్రం పై తాజాగా మరో యాక్టర్ ఆదిపురుష్ మూవీ మేకర్స్ పై మండిపడ్డారు. బాలీవుడ్ యాక్టర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన విందు ధారా సింగ్ ఆదిపురుష్ మేకర్స్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ యాక్టర్ విందు ధారా సింగ్ ఆదిపురుష్ మూవీ యూనిట్ పై మండిపడ్డారు. విందు ధారా సింగ్ ఎన్నోసార్లు హనుమంతుడి పాత్రలో నటించారు. అతను మాత్రమే కాకుండా విందు ధారా సింగ్ తండ్రి, దివంగత యాక్టర్ ధారా సింగ్, రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర రామాయణంలో హనుమంతుడిగా నటించారు. ముఖ్యంగా హనుమంతుని క్యారెక్టర్ ను వక్రీకరించడం పై తీవ్ర అసంతృప్తిని తెలిపారు.
విందు ధారా సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ మూవీ నిర్మాతల తీరుపై విమర్శలు చేశారు. అలాగే హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా నాగేపై సటైర్లు వేశాడు. హనుమంతుడు పాత్ర చేసిన దేవదత్తా నాగే హిందీలో సరిగ్గా మాట్లాడలేడు. ఇక అతడికి ఇచ్చిన డైలాగ్లతో హనుమంతుడి పాత్రను వేరే విధంగా చూపారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. హనుమంతుడి క్యారెక్టర్ లో తన తండ్రి చరిత్ర సృష్టించాడని, ఆయన యాక్టింగ్ కు దరిదాపుల్లోకి సైతం రాలేరని మండిపడ్డారు.
‘మేకర్స్ చేసిన పనిని చూస్తే సిగ్గుగా ఉంది. వీళ్ళు మందు తాగి వచ్చారో? ఏం ఆలోచిస్తున్నారో కూడా వారికే తెలియదు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి అద్భుతమైన మూవీ తెరకెక్కించే బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశారు. రామాయణం స్టోరీతో ఆడుకున్నారు. అందువల్లే ఈ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది’ అని అన్నారు.
Also Read: నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ థాంక్స్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిహారిక భర్త..

1. బ్రహ్మానందం – రంగమార్తాండ:
2. ఎల్ బి శ్రీరామ్ – అమ్మో ఒకటో తారీఖు:
3. రఘుబాబు- మురారి:
5. వెన్నెల కిషోర్ – గూడాచారి:
6. వేణు మాధవ్ – అన్నవరం: 
పెద్దల సమక్షంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడి విడిగా ఉంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో నిహారిక, చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మొదలు అయ్యాయి. అంతేకాక మెగా కుటుంబంలో జరిగే వేడుకల్లో చైతన్య లేకుండా నిహారిక మాత్రమే కనిపిస్తుండటం వల్ల ఈ జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా జరిగిన నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కి, అలాగే రామ్ చరణ్ ఉపాసనల పాప బారసాలలో కూడా చైతన్య లేకుండా నిహారిక ఒక్కరే హాజరు అయ్యారు. కానీ విడిపోతున్నారని వస్తున్న ప్రచారం పై అటు నిహారిక, ఇటు చైతన్య ఎక్కడా స్పందించలేదు. ఈ క్రమంలో చైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. విడాకుల వార్తల తరువాత అతను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు.
చైతన్య జొన్నలగడ్డ 4 నెలల అనంతరం ఒక మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేస్తూ, ‘నన్ను ఇక్కడికి నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా, విపాసన యోగా చేయడంతో నా లైఫ్ లో కాస్త ఉల్లాసంగా ఉందని, ఎక్కడికైనా మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా వెళ్ళినపుడు జ్ఞానంతో బయటకు వస్తాం. ఈ చోటు కూడా అలాంటిదే’ అని చైతన్య రాసుకొచ్చాడు.
మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.






మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు డాటర్ నిహారిక యాంకర్ గా సినీ పరిశ్రమ అడుగు పెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు. కానీ నిహారిక నటించిన చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. దాంతో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. నిహారిక సినిమాలు నిర్మిస్తూ, అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం ఇండస్ట్రీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ, ఆ తరువాత ప్రొడ్యూసర్ గా స్థిరపడ్డారు. అయితే సుస్మిత గతంలో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిందంట. చిరంజీవి సుస్మితను హీరోయిన్ పరిచయం చేయాలని అనుకున్నారంట. కానీ సుస్మితను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఆ ఆలోచనను చిరంజీవి పక్కకు పెట్టారని సమాచారం.
సుస్మిత హీరోయిన్ గా ఒక చిత్రంలో నటించారట. అయితే ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉదయ్ కిరణ్, సుస్మిత జంటగా నటించారట. ఈ మూవీ మొదటి సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది. అయితే సెకండ్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ కాలేదంట. దాంతో ఆ మూవీ రిలీజ్ కాలేదని తెలుస్తోంది.
ఈసారి అంతకుమించి అనేలా కొత్త కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నాడు అందువల్ల త్రివిక్రమ్ అల్లు అర్జున్ రేంజ్ కు తగిన విధంగానే స్టోరీని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వినిపిస్తున్నటాక్ ప్రకారం వీరి కాంబోలో రాబోయే మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే ఉంటుందట.
గతంలో త్రివిక్రమ్ ఎన్నోసార్లు ఈ కాన్సెప్ట్ తో కొన్ని స్టోరీలను అనుకున్నాడు. అయితే అవి సెట్స్ పైకి వెళ్లలేదు. గుణశేఖర్ తెరకెక్కించాలనుకున్న ‘హిరణ్యకశిప’ సినిమాకు మాటలను అందించాలని త్రివిక్రమ్ భావించాడు. కానీ సినిమా ముందుకు వెళ్లలేదు. త్రివిక్రమ్ బన్నీతో చేయబోయే మూవీ ఏమిటి అనే విషయం పై అందరికి ఇంట్రెస్ట్ కలిగింది. అయితే అది సోషియో ఫాంటసీ మూవీ అని బలంగా వినిపిస్తోంది.
అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఎటువంటి చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకుంటారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఏర్పడింది. మాటల మాంత్రికుడుగా గా పేరుగాంచిన త్రివిక్రమ్ పెన్ పవర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా త్రివిక్రమ్ హిస్టరీ, మైథలాజికల్ కథల పై పట్టున్న రైటర్. అయితే త్రివిక్రమ్ ఎటువంటి ఫాంటసీ స్టోరీ పై దృష్టి పెడతాడో అని అనుకుంటున్నారు.


