పాఠశాల, యాత్ర, ఆనందో బ్రహ్మ లాంటి చిత్రాలతో డీసెంట్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మహి వి.రాఘవ్ ఇటీవల ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తాజాగా ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్‌తో మహి వి.రాఘవ్ తెరకెక్కించారు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ కాగా, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
- వెబ్ సిరీస్ : సైతాన్
- నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, జాఫర్ సాదిక్,దేవయాని శర్మ,కామాక్షీ భాస్కర్ల, నితిన్ ప్రసన్న, మణికందన్ తదితరులు
- నిర్మాత : మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
- దర్శకత్వం : మహి వి రాఘవ్
- ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం
- సంగీతం : శ్రీరామ్ మద్దూరి
- ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- ఎపిసోడ్స్ : 9
- విడుదల తేదీ: జూన్ 15, 2023

స్టోరీ:
సావిత్రి (షెల్లీ నబు కుమార్)కి ముగ్గురు పిల్లలు బాలి (రిషి),గుమ్తి (జాఫర్ సాధిక్), జయ (దేవయాని శర్మ).ఆమెను భర్త వదిలివేయడంతో తన ముగ్గురు పిల్లల పోషణ కోసం విధిలేని పరిస్థితుల్లో సావిత్రి యాకుబ్ అనే కానిస్టేబుల్ తో సహజీవనం చేస్తుంది. తన తల్లి గురించి చుట్టుపక్కలవారు చెడుగా మాట్లాడుతుంటే బాలి తల దించుకుని బ్రతకాల్సి వస్తుంది. బాలి తన కుటుంబాన్ని కష్టపడి పోషించాలని భావిస్తాడు. కానీ బాలికి ఎవరు పని ఇవ్వరు.

బాలి రక్తాన్ని చూస్తేభయపడుతుంటాడు. అలాంటి బాలి అనుకోని పరిస్థితుల్లో తల్లి కోసం వచ్చే కానిస్టేబుల్ తల నరికి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. జైలు నుండి బయటికి వచ్చిన బాలి తనవారికి అండగా ఉన్నాడా? బాలి నేరస్థుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు ఉన్నాడు? బాలి జీవితం చివరకు ఏమైంది? అనే విషయలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ:
సినిమాలలో చూపించలేని ఎరోటిక్, బోల్డ్ కథాంశాల్ని ఆడియెన్స్ కి చెప్పడానికి ఓటీటీ వేదికగా మారింది. ఈ సైతాన్ కూడా అలాంటి స్టోరీనే. ఇది బాలి కథ. తాను, తన ఫ్యామిలిని బతికించుకోవడం కోసం తప్పని పరిస్థితుల్లో నేరస్తుడిగా మారిన వ్యక్తి బాలి. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. అయితే దర్శకుడు ఈ కథను హార్డ్ హిట్టింగ్ వేలో ఆడియెన్స్ కు చూపించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధాన పాత్రలు చెప్పే ప్రతి డైలాగ్లోనూ ఒక బూతు వినిపిస్తుంటుంది.
ఎరోటిక్ సన్నివేశాల విషయంలో మూవీ టెక్నిక్స్ అనుసరించకుండా దర్శకుడు బోల్డ్‌గా చూపించాడు. బాలి పగ తీర్చుకునే సీన్స్ లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంది. మొత్తం 9 ఎపిసోడ్ లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.బాలి చిన్నతనం, రక్తం చూస్తే భయపడే బాలి నేరస్తుడిగా ఎలా మారాడు అనేది ఎమోషనల్‌గా చూపించారు. నగల షాప్ ఓనర్ మోసం చేయడంతో బాలి విప్లవ దారిలో వెళ్ళడం సిరీస్ లో కొత్త టర్న్.
బాలి కళావతి పై ఇష్టంతో దళంలో చేరి, గొప్ప లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది యాక్షన్ సీన్స్,పగ వంటి వాటితో నడిపించారు. బాలి పాత్రకు రుషి పూర్తిగా న్యాయం చేశాడు. అమాయకంగా కనిపిస్తూనే క్రూయాలిటీని చూపించాడు. జయగా దేవయాని బోల్డ్ పాత్రలో నటనతో ఆకట్టుకుంది. రవికాలే, కామాక్షి భాస్కర్ల, జాఫర్ సాధిక్ వారి నటనతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్:
- బాలిగా రిషి నటన,
- నిర్మాణ విలువలు,
మైనస్ పాయింట్లు:
- స్క్రీన్ ప్లే,
- బోల్డ్ డైలాగ్స్,
- హింస, రక్తపాతం
రేటింగ్:
3/5
టాగ్ లైన్ :
‘సైతాన్’ కుటుంబంతో కలిసి చూసే వెబ్ సిరీస్ కాదు ఒంటరిగా చూసే వారు వీకెండ్ లో టైం పాస్ కోసం ఒకసారి చూడవచ్చు.
watch trailer :
https://www.youtube.com/watch?v=XP6-yZoDQio&ab_channel=Disney%2BHotstarTelugu
Also Read: ఫ్లాప్ టాక్ తో కూడా డబ్బులు రాబట్టిందా..? ఎంతంటే..?



















తమిళనాడులో జన్మించిన స్వక్ష అయ్యర్ చిన్నప్పటి నుండే ప్రకటనలలో, సినిమాలలో ను బాలనటిగా రాణించింది. ఆమె ఇప్పటివరకు 130 కి పైగా ప్రకటనల్లో నటించింది. అంతేకాకుండా కోలీవుడ్ మరియు శాండల్‌వుడ్ లో పలు సినిమాలలో నటించింది. స్వక్ష మొదట టెలివిజన్ ప్రకటనలలో నటించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనలలో నటించిన తర్వాత, ఆమె మొదటి సారిగా 2013లో కళ్యాణ సమయ సాధన అనే సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
స్వక్ష అయ్యర్ 2016 లో తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుకు దుద్దులో బాలనటిగా కీలక పాత్రను పోషించింది. ఇందులో స్వక్ష హీరోయిన్ చిన్నప్పటి పాత్రను పోషించింది. ఆ తరువాత 2017 లో విడుదలైన నిబునన్ అనే సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా నటించింది. ఈ సినిమాలో హీరో ప్రసన్న, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు సుహాసిని నటించారు. ఈ మూవీ తెలుగులో కురుక్షేత్రం పేరుతో రిలీజ్ అయ్యింది. అదే ఏడాది స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నటించిన ‘సాంగు చక్రం’ అనే సినిమాలో స్వక్ష నటించింది.
స్వక్ష అనేక టీవీ కమర్షియల్ ప్రకటనలలో నటించింది. హై-ప్రొఫైల్ బ్రాండ్లను ఆమోదించింది. హాట్సన్ పెరుగు, కోల్గేట్ టూత్ పేస్ట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఉదయకృష్ణ నెయ్యి వంటి 130 యాడ్స్ పైగా నటించింది. ప్రస్తుతం మోడెల్, నటిగా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్వక్ష అయ్యర్ కి ఇంస్టాగ్రామ్ లో 217 ఫాలోవర్స్ ఉన్నారు.
చక్కగా తెలుగులో మాట్లాడడం, డ్యాన్స్ బాగా చేస్తుండడంతో యంగ్ హీరోయిన్ శ్రీలీల పై దృష్టి పడింది. ధమాకా హిట్ తో టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ నటిస్తోంది. ఈ రోజు (జూన్ 14) శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తోన్న చిత్రాల నుండి వరుసగా ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. ఆమె ప్రస్తుతం పది సినిమాలలో నటిస్తోంది.
వాటిలో సుమారు 8 చిత్రాలు ప్రకటించారు. వాటిలో ప్రస్తుతం 6 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని సినిమాలు త్వరలో షూటింగ్ మొదలవనుంది. దీంతో శ్రీలీల బిజీ బిజీగా ఉంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో ట్విట్టర్ అంతా శ్రీలీల పోస్టర్స్ తో ట్రెండ్ అవుతున్నాయి.
ఆమె నటిస్తోన్న మొత్తం సినిమాలను చూస్తే పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, బాలకృష్ణతో భగవంత్ కేసరి, మహేష్ బాబు గుంటూరు కారం, డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మూవీలో నటిస్తోంది. అలాగే ఆహా ఓటీటీ మూవీ కోసం అల్లు అర్జున్ సినిమాలో, నితిన్ కొత్త చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. ఇక ఇన్ని సినిమాలలో నటిస్తున్న శ్రీలీల మూవీ పోస్టర్స్ పై నెట్టింట్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
కొన్నేళ్ళ నుండి ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న గ్రాండ్ గా నాగబాబు నివాసంలో జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు హాజరు అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే వీరి వివాహం జరుగనుంది.
వీరి ఎంగేజ్మెంట్ తరువాత అల్లు అరవింద్ చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్లో లావణ్య గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే పదేళ్ళ క్రితమే ఒక సినిమాలో లావణ్య పెళ్లి గురించి చెప్పారని ఒక వీడియో తాజాగా వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఈ చిత్రంలో ఒక సీన్ లో లావణ్య త్రిపాఠిని పిల్లలు నీ పెళ్లికి చిరంజీవి వస్తాడట నిజమేనా అని అడుగుతారు. అప్పుడు లావణ్య వారితో అవును అంటుంది. ఆ సినిమాలో చెప్పినట్టుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలపెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడనే విషయం తెలిసిందే. వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కూడా చిరంజీవి హాజరు అయ్యారు.
పురాణ గాథలను, ఇతిహాసాలను మూవీగా తెరకెక్కించడం అంటే ఆ డైరెక్టర్ కి కత్తిమీద సాములాంటిదే. స్టోరీలో ఎలాంటి మార్పులు చేసినా చరిత్రకారుల విమర్శల ఎదరోకోవాల్సి వస్తుంది. అలా అనుకుని ఇంట్రెస్టింగ్ చూపించకపోతే ఆడియెన్స్ ను మెప్పించలేరు. అందువల్ల ఇటువంటి కథలను ఎంచుకునే ముందు దర్శకులు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తారు. అయితే ఆదిపురుష్ తీసిన దర్శకుడు 2 చిత్రాలను తీసిన అనుభవంతోనే భారీ బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ ను తెరకెక్కించాడు.
ఓంరౌత్ ముంబైలో పుట్టి, పెరిగారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఓంరౌత్ తాత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ మరియు ఎడిటర్. అందువల్ల ఓంరౌత్‌కు సినిమా పై ఆసక్తి పెరిగింది. దీనికోసం తన చదువు పూర్తయ్యాక, న్యూయార్క్‌లో సిని ఫీల్డ్ కు చెందిన కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. రచయితగా, దర్శకుడిగా కొన్నాళ్ల పాటు ఎమ్‌టీవీ నెట్‌వర్క్‌లో వర్క్ చేశాడు. హాంటెడ్-3డీ, సిటీ ఆఫ్ గోల్డ్ సినిమాలకు నిర్మాతగా చేశారు.
2015 లో లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ అనే మరాఠీ సినిమాతో ఓంరౌత్ డైరెక్టర్ గా మారాడు. డైరెక్టర్ గా మొదటి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2020లో ఓంరౌత్ రెండో సినిమా ‘తానాజీ ‘ తెరకెక్కించారు. ఈ చిత్రంతో ఓంరౌత్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ఇక మూడవ సినిమా రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కించారు. ట్రైలర్ తో ఈసినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగు సిని పరిశ్రమలో లెజెండరీ నటుడిగా వెలుగోందారు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండడటంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. అలాంటి ఎన్టీఆర్ సినిమాలలో చేయని పాత్ర అంటూ లేదు. తన చిత్రాలతో తెలుగువారిని అలరించారు. సూపర్ హీరోల సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. కానీ సీనియర్ ఎన్టీఆర్ 1980 లోనే ఆ తరహా చిత్రంలో నటించారు. ఈ సినిమా గురించి ఇప్పటివారికి అంతగా తెలియక పోవచ్చు.
సూపర్ మెన్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి వి.మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. 1980 లో వచ్చిన సూపర్ మేన్ సినిమాను ఆర్. గోపాల్ నిర్మించాడు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జయమాలిని, కైకాల సత్యనారాయణ, పండరి బాయి ముఖ్యపాత్రలలో నటించారు. తన కుటుంబాన్ని హత్యమార్చిన వారిని వెతికి పట్టుకోవాలనుకునే అబ్బాయి. అంజనేయస్వామిని ప్రార్ధిస్తాడు.
ఆంజనేయుడి ఆశీర్వాదాలతో, అతడు అతీంద్రియ శక్తులను పొంది సూపర్ మేన్ గా మారుతాడు. అయితే అప్పటిదాకా ఎన్నో అద్భుత పాత్రలను పోషించిన ఎన్టీఆర్ కి ఆపాత్ర అంతగా నప్పలేదని, వయసురీత్యా ఆయన సూపర్ మేన్ గా సెట్ అవలేదని టాక్. ఇప్పటివారికి ఆ మూవీని చూసినప్పుడు అలానే అనిపించవచ్చు. ఈ సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయి.














