ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యం తారక్ వరుస ప్రాజెక్టులకు సైన్ చేసారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 30 వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు ఎన్టీఆర్.
కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని తన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి 5 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంకా ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు.
అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం దేవర అనే టైటిల్నుఅనుకుంటున్నట్లు సమాచారం. ఈ టైటిల్ను గతం లో పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిష్టర్ చేయించుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం దాన్ని రెన్యూవల్ చేయించుకోలేదట. దీంతో ఆ టైటిల్ను ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం వాడుకుందామని అనుకుంటున్నారట.
అయితే ఈ టైటిల్ పై ఎన్టీఆర్ ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారంట. . ఈ టైటిల్ ఏమీ బాగా లేదని, తెలుగు వరకు ఈ టైటిల్ ఓకే అనుకుంటే.. పాన్ ఇండియన్ లెవెల్లో ఏ టైటిల్ పెడతారు? అంటూ టీంను నిలదీస్తున్నారు. ఈ టైటిల్ తమకేమీ నచ్చలేదని నందమూరి అభిమానులు అంటున్నారు.మరి వీటిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏమైనా స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి..
#ntr30 టైటిల్ …దేవర… @ganeshbandla రెన్యూవల్ చేయడం మరిచిపోతే, అదే టైటిల్ తీసుకున్న @KoratalaShiva
— devipriya (@sairaaj44) November 12, 2022