బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్‌.. పంచ్‌లతో ఆడియన్స్‌ను నవ్వించడంలో ఆది స్టైలే వేరు. షో ఏదైనా.. స్టేజీ ఎక్కడైనా.. ఆది ఉన్నాడంటే కామెడీ పండాల్సిందే. జబర్దస్త్ ద్వారా ఏందో మంచి గుర్తింపు పొందిన ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

Video Advertisement

 

ఇలా అన్ని కార్యక్రమాలలోనూ కమెడియన్ గా తనదైన శైలిలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఆది మరో సరికొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వహిస్తున్నటువంటి టీం లిటిల్ హార్ట్స్ అనే సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమం చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14వ తేదీ సాయంత్రం ప్రసారం కానుంది.

hyper aadi new avtar as an anchor..??

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమానికి మాత్రం యాంకర్ గా హైపర్ ఆది వ్యవహరించడం విశేషం. ఇలా సరికొత్త కార్యక్రమానికి హైపర్ ఆది వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

hyper aadi new avtar as an anchor..??

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ఇప్పటికే సుధీర్.. తర్వాత రష్మీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ ఈవెంట్ కి ఆది యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఆది ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.