పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కొద్ది రోజుల్లో రాబోతోంది. పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చిన సినిమాల్లో మొదటి సినిమా తమ్ముడు. ఈ సినిమాకి పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల అయ్యి 22 సంవత్సరాలు అయ్యింది. అయినా సరే ఇప్పటికి కూడా సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ కానీ, యాక్షన్ కానీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా రమణ గోగుల అందించిన పాటలు అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా స్పెషల్ షో కూడా రిలీజ్ చేస్తున్నారు అని సమాచారం. తమ్ముడు సినిమా స్పెషల్ షో ఆగస్ట్ 31వ తేదీన రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు చేసిన కొన్ని వింత పనులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా నడుస్తుంటే మధ్యలో ఎక్సర్సైజ్ చేయడం, పుష్ అప్ చేయడం, హీరో బాక్సింగ్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లు కూడా బాక్సింగ్ చేయడం, పాట వస్తున్నప్పుడు ట్రైన్ లాగా అందరూ నిలబడి వెళ్లడంలాంటివి చేశారు. సరే ఇంత మంచి సినిమా విడుదల అయితే ఆ మాత్రం హంగామా ఉంటుంది కానీ ఇలాంటి పనులు ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ సంవత్సరం మొదట్లో విడుదలై హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలకి సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://www.instagram.com/p/Ch86FRZuW7x/