వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఏం జరుగుతుందో తెలుసా..? అసలు హైబ్రిడ్ వర్క్ అంటే ఏంటి..!?

వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఏం జరుగుతుందో తెలుసా..? అసలు హైబ్రిడ్ వర్క్ అంటే ఏంటి..!?

by Anudeep

Ads

కోవిడ్ అనంతరం ఉద్యోగుల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆఫీసుల్లో పనులు చేసే ఉద్యోగుల్లో ఇప్పటికీ చాలామంది ‘వర్క్ ఫ్రం హోం’ ని వినియోగించుకుంటున్నారు. అయితే.. ఈ కరోనా ప్రభావం తగ్గాక ఉద్యోగులకు సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చిన మరో కొత్త విధానం హైబ్రిడ్ వర్క్.

Video Advertisement

అంటే.. ఉద్యోగులు వారంలో ఎన్నిరోజులు ఆఫీస్‌లో చేయాలో, ఎన్ని రోజులు ఇంటి వద్ద నుంచి పని చేయాలో వారి ఇష్టానికే వదిలేయడం. ఈ హైబ్రిడ్‌ వర్క్ లో కూడా కంపెనీల పాలసీలు ఒక్కో కంపెనీలో ఒక్కో విధంగా ఉంటాయి. అవేంటో చూద్దాం..

#1. హైబ్రిడ్ ఎట్ విల్ (Hybrid at-will):

ఈ పద్దతిలో ఆఫీస్‌లో ఎప్పుడు పని చేయాలో, ఇంట్లో ఎప్పుడు పని చేయాలో ఉద్యోగులే నిర్ణయించుకునే అవకాశం ఉంది.

#2. హైబ్రిడ్ స్ప్లిట్ వీక్ (Hybrid split-week):

ఈ విధానంలో కంపెనీనే ఉద్యోగులు వారంలో ఏఏ రోజులు ఆఫీస్‌కు రావాలో నిర్ణయిస్తుంది. మిగతా రోజుల్లో ఇంటి వద్దే ఉండి పని చేయాలి.

#3. హైబ్రిడ్ మేనేజర్ షెడ్యూలింగ్ (Hybrid manager-scheduling):

ఈ విధానంలో మేనేజర్లు వారి టీమ్ మెంబర్స్‌ ఆఫీస్‌కు ఎప్పుడు రావాలో, ఎవరు ఇంటి దగ్గర ఉండి పని చేయాలో నిర్ణయిస్తారు.

#5. హైబ్రిడ్ మిక్స్ (Hybrid Mix):

పై మూడు మోడల్స్‌ను కలిపి ఉద్యోగులతో పని చేయించుకునే విధానమే హైబ్రిడ్ మిక్స్. ఈ హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి నికోలస్ బ్లూమ్ ఆఫ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ విధానం వల్ల సంస్థలకు మేలు జరిగిందని అధ్యయనంలో వెల్లడైంది.

ఉద్యోగుల పనితీరుపై, ప్రమోషన్లపై ఈ హైబ్రిడ్ వర్క్ విధానం ఎలాంటి ప్రతికూలత చూపలేదని తేలింది. ఈ హైబ్రిడ్ వర్క్‌ ఆప్షన్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చిన చాలా కంపెనీలు వారంలో రెండు, మూడు రోజులు ఆఫీస్‌లో పని చేయించుకుని, మిగిలిన రోజులు ఇంటి వద్ద నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది.

 

రిమోట్ డేస్ లో తక్కువ గంటలు పని చేస్తున్న ఉద్యోగులు.. మిగిలిన రోజుల్లో పని గంటలను పెంచుకుని మరీ పని చేస్తున్నట్టుగా తేలింది. ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌లో చేసే పని గంటలతో పోల్చుకుంటే 80 నిమిషాలు తక్కువే పని చేస్తున్నారట. ఫైనల్ గా ఈ విధానం వల్ల సంస్థకు, ఉద్యోగులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని తేలింది.


End of Article

You may also like