శ్రీదేవి డ్రామా కంపెనీ: డాన్స తో అదరగొట్టిన బస్ కండక్టర్ రియల్ లైఫ్ కన్నీటి కష్టాల గురించి తెలుసా.?

శ్రీదేవి డ్రామా కంపెనీ: డాన్స తో అదరగొట్టిన బస్ కండక్టర్ రియల్ లైఫ్ కన్నీటి కష్టాల గురించి తెలుసా.?

by Anudeep

Ads

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షోలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. అయితే ఈ షో ఒక్క తాజా ప్రోమో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే చాలామంది దృష్టిని ఆకట్టుకుంది. ప్రోమో రిలీజ్ అయి 24 గంటలు గడవకముందే ఇప్పటికే ఇది 7 లాక్స్ వ్యూస్ ను దాటింది.ఈ ప్రోమో ని చూసిన నటిజన్లు కండక్టర్ డాన్స్ కు ఫిదా అయి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ఎపిసోడ్ ఆగస్టు 28 ఆదివారం 2022 మధ్యాహ్నం ఒంటి గంటకి ఈటీవీ ఛానల్ లో ప్రీమియర్ చేయబడింది

Video Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ ఇతివృత్తం కప్పల పెళ్లి. ఇందులో ఆటో రాంప్రసాద్ ,హైపర్ ఆది,చలాకీ చంటి, రాకెట్ రాఘవ ,తాగుబోతు రమేష్ తమ ట్రేడ్ మార్క్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు.

అంతేకాదండోయ్ ఈ షోకు శ్రీకాకుళం జానపద పాటలు ఈసారి మంచి హైప్ ని తెచ్చాయి. ఇందులో ప్రత్యేకంగా ఆర్టీసీ కండక్టర్ అయిన ఝాన్సీ ప్రస్తుతం ట్రెండింగ్ గా ఉన్న పల్సర్ బైక్ పాటకు వేసిన డాన్స్ ఈ షోకే హై లైట్.ఝాన్సీ మాస్ స్టెప్స్ కి కమెడియన్స్ అందరూ ఉర్రూతలూగుతూ ఎంజాయ్ చేశారు. ఇక రష్మి గౌతమ్ మరియు ఆమని అయితే……ఝాన్సీ తో కలిసి స్టేజ్ ని ఒక ఊపు ఊపారు..

ఆ డాన్స్ ఆమెకి ఎంత పాపులారిటీ తెచ్చిందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాజువాక లేడీ కండక్టర్ డాన్స్ న్యూస్ ట్రెండింగ్ గా ఉంది. చిన్నతనం నుంచి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆమె 2012లో గాజువాక ఆర్టీసీ డిపోలో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కుడా కుటుంబ సభ్యుల సహకారంతో డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంది.

జెమినీ టీవీ డాన్స్ స్టార్ ప్రోగ్రాంలో మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ అందుకున్న ఆమె ఎంతో ఆనందించింది. ఆ తరువాత మాటీవీలో రంగం 2, జీ తెలుగులో తీన్మార్ కార్యక్రమాల్లో డాన్సర్ గా చేసింది. ఈ ప్రోగ్రామ్స్ ఆమెకి మంచి గుర్తింపును పేరును తెచ్చిపెట్టాయి. అయితే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ పల్సర్ సాంగ్ మాత్రం ఆమెను వేరే లెవెల్ కు తీసుకెళ్ళింది. ఈ సాంగ్ కి ఝాన్సీ వేసిన ఊర మాస స్టెప్పుల కు స్టేజి మొత్తం దద్దరిల్లింది.

watch video:

అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. మూడు నెలలు గంజి అన్నం, ఆవకాయ్ మాత్రమే తిని బతికాను అంటూ తన కన్నీటి కష్టాలు చెప్పుకొచ్చారు. “పోలీస్ కానిస్టేబుల్ గా చేసిన నాన్న మా కుటుంబాన్ని రోడ్డున పడేసి వెళ్ళిపోతే అమ్మ మమ్మల్ని వదిలిపెట్టకుండా పాన్ షాప్ పెట్టుకుని, ఉల్లిపాయలు అమ్మి చదివించింది” అని చెప్పారు. అంతే కాదు ఇన్ని కష్టాల మధ్యలో 8 వ తరగతి చదువుతున్నప్పుడు డాన్స్ నేర్చుకొని ఎన్నో ప్రైజెస్ గెలిచారు ఝాన్సీ.

అంతేకాదు కూతురు రోడ్డు మీద డాన్స్ చేసి సంపాదిస్తుంటే తింటున్నారా తన అమ్మని, తమ్ముడ్ని హేళన చేసారు అని చెప్పారు. ఇప్పుడు తన తమ్ముడిని ఎంబీఏ చదివించానని, హెచ్.ఆర్. మేనేజర్ గా చేస్తున్నారు అంటూ చెప్పారు ఝాన్సీ. “చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగాను కాబట్టి ఆయనలా కొంతైనా నేర్చుకోవాలని ఉంది. డుపు నింపుకోవాలంటే రెండు పనులు తప్పించి ఏ పనైనా చేసి సంపాదించుకోవచ్చు” అంటూ తన రియల్ లైఫ్ విషయాల గురించి పంచుకున్నారు.

watch video:


End of Article

You may also like