ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రిలీజ్ అవుతున్న పూరి జగన్నాధ్ సినిమా ఇదే. అంతే కాకుండా పూరి జగన్నాధ్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. సినిమా విడుదల అయితే పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా టాక్ చాలా నెగెటివ్ గా వస్తోంది. అసలు ఈ సినిమాని తెలుగు సినిమాలాగా లేదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు పూరి జగన్నాధ్ కి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఒకటి ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతే కాకుండా ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో విజయ్ దేవరకొండ హీరోగా జన గణ మన సినిమా కూడా మొదలు పెట్టేసారు. ఆల్రెడీ పూరి జగన్నాధ్ ఒక ఇంటర్వ్యూలో, “ఈ సినిమా హిట్ అవుతుంది అని మాకు ఎంత నమ్మకం అంటే, దీనికంటే రెట్టింపు బడ్జెట్ తో జన గణ మన మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం” అని చెప్పారు.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ జన గణ మన సినిమా చేయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ తన సన్నిహితులతో కూడా అన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే జన గణ మన ప్రాజెక్ట్ మళ్లీ ఆగిపోతుంది. అంతకుముందు మహేష్ బాబుతో ఈ సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు ఈ సినిమా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సినిమా తెర పైకి వెళ్లే అవకాశాలు లేవేమో అని అంటున్నారు.