కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తం లో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు.
కేజీఎఫ్ కన్నడ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తారో కేజీఎఫ్ సినిమా కోసం కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే ఎదురు చూసారు.
ఇటీవలే కేజీఎఫ్ – 2 సినిమా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. కెజిఎఫ్ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల అయిన తరువాత ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదల అయిన సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంటోంది. అయితే.. ఈ సినిమాలో కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటె.. మరింత పెద్ద హిట్ టాక్ తెచ్చుకునేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ తప్పులేంటో చూద్దాం.
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మైనస్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో సూపర్ సీన్లు రాసుకున్న డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం తడబడినట్లు అనిపిస్తుంది. అనంత్ నాగ్ పాత్రని ప్రకాష్ రాజ్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రకాష్ రాజ్ కంటే అనంత్ నాగ్ ఈ పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాగే.. పాటలు కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా లేవు.
అయితే ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చేస్తుంది. ప్లస్ పాయింట్ ఏంటి అంటే.. ఈ సినిమా క్లైమాక్స్. ఊహలకు భిన్నమైన క్లైమాక్స్ తో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులని అలరిస్తాడు. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కు పక్కా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. అయితే.. ఈ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఉంటె బాగుండేది.