టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా ఇప్పుడు నటిగా కూడా రాణిస్తున్నారు అనసూయ. అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా యాంకర్ గా చేస్తారు అనసూయ. టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
క్షణం, రంగస్థలం సినిమా ల్లో అనసూయ పోషించిన పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా అనసూయ ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవల పుష్పలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు అనసూయ. సినిమా ఎండ్ అయిన విధానం చూస్తే పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా అనసూయ పాత్ర ఉంటుంది.
అందులో అనసూయ పాత్ర ఒక ముఖ్య పాత్ర అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ లో అనసూయ, “ప్రతి మీమ్ పేజ్, ట్రోల్ పేజి ఇవాళ సడన్ గా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది 24 గంటల్లో అయిపోతుంది. కాబట్టి ఆడవాళ్లందరికీ హ్యాపీ ఫూల్స్ డే” అని రాశారు. అలాగే ఇప్పుడు గుమ్మడి కాయల దొంగ లు అందరూ వచ్చి నా ట్వీట్ కింద కామెంట్స్ పెడతారు అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అనసూయ భీష్మపర్వం అనే ఒక ఇటీవల ఒక మలయాళం సినిమా లో కూడా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది.