సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.
ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. సినిమాకి సంధించిన షూటింగ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షూటింగ్‌కి కొంచెం బ్రేక్ పడింది. మళ్లీ త్వరలో షూటింగ్ మొదలవుతుంది అని సమాచారం.
ఇదిలా ఉండగా మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈ ఎడ్వర్టైజ్మెంట్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు ఒక రిస్కీ స్టంట్ చేస్తూ కనిపించారు. ఇదే ఎడ్వర్టైజ్మెంట్ హిందీలో హృతిక్ రోషన్ చేశారు. అయితే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మానందం ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు వచ్చే సీన్ గుర్తుండే ఉంటుంది. అందులో బ్రహ్మానందం హీరోయిన్ చెల్లితో రోలర్ కోస్టర్ లో కూర్చుంటారు.
మొదటిసారి అవ్వడంతో హీరోయిన్ చెల్లెలు భయపడుతూ ఉంటుంది. ఇది చూసిన బ్రహ్మానందం హీరోయిన్ చెల్లిని భయపడొద్దు అని చెప్తారు. కానీ స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్ చెల్లి ఎంజాయ్ చేస్తూ ఉంటే బ్రహ్మానందం భయపడతారు. ఈ ఆడియోకి మౌంటెన్ డ్యూ ఎడ్వటైజ్మెంట్ వీడియో యాడ్ చేసి ఎడిట్ చేశారు. “అంత మంచి ఎడ్వర్టైజ్మెంట్ అని ఇలా కామెడీగా చేశారు” అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CZof-bvFf6U/?utm_medium=copy_link