సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.
ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు రాబోతున్న ఒక పాట అంతకు ముందు వచ్చిన ఒక పాట ట్యూన్ కి దగ్గరగా ఉంది. వివరాల్లోకి వెళితే, శర్వానంద్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.
ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ తిరుమల అంతకుముందు రామ్ హీరోగా నటించిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో ఖుష్బూ, ఊర్వశి, రాధిక శరత్ కుమార్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అవ్వబోతోంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేస్తామని సినిమా బృందం ప్రకటించారు. దానికంటే ముందు ఈ పాట ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఈ పాట ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా పాటకి దగ్గరగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకూ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. అలాగే ఈ రెండు పాటలను కూడా దేవి శ్రీ ప్రసాద్ పాడారు. దాంతో రెండు పాటలు ట్యూన్స్ ఇంకా దగ్గరగా అనిపిస్తున్నాయి.