ఒకే రంగానికి చెందిన తండ్రీకొడుకులు ఎలా ఉంటారో అదే విధంగా ఒకే రంగానికి చెందిన అన్నదమ్ములు కూడా ఉంటారు. మన సినిమా ఇండస్ట్రీలో అలా అన్నదమ్ములు ఇద్దరు ఇదే రంగంలో ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు.
ఇద్దరూ నటనలోనే ఉండడం కాకుండా కొంతమంది ఒకళ్ళు నటనలో ఒకళ్ళు దర్శకత్వంలో అలా వేరే శాఖలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. శాఖలు వేరే అయినా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్నదమ్ములలో కొందరిని ఇప్పుడు చూద్దాం.
#1 చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు
ముగ్గురూ సినిమాల్లో నటిస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు. నాగబాబు సినిమాల్లో నటించడం, నిర్మించడమే కాకుండా రియాలిటీ షోలలో కూడా జడ్జి గా కనిపిస్తూ ఉంటారు.
#2 నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ
ఇద్దరు హీరోలుగా ఎన్నో సినిమాలు చేశారు.
#3 సురేష్ దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి
వెంకటేష్ సినిమాల్లో నటిస్తూ ఉంటే, సురేష్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు నిర్వహిస్తారు.
#4 రమేష్ బాబు, మహేష్ బాబు
రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత మహేష్ బాబు నటించిన అతిథి సినిమాని నిర్మించారు.
#5 కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
ఇద్దరూ కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని, ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు.
#6 సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా నటించి పేరు సంపాదించుకున్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
#7 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో నటించాడు. ఇప్పుడు పుష్పక విమానం అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
#8 రామ్ చరణ్, వరుణ్ తేజ్
వీళ్లు కూడా ఎవరి శైలిలో వాళ్ళు సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
#9 అలీ, ఖయ్యుం
ఖయ్యుం కూడా బ్లేడ్ బాబ్జి, కెవ్వు కేక, ఇంకా చాలా సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు.
#10 ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్
ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం సినిమాలనుండి విరామం తీసుకున్నారు. అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు సినిమా, మరొక సినిమా నాంది ఇటీవల విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
#11 నాగ చైతన్య, అఖిల్
నాగ చైతన్య ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇటీవల విడుదల అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది..
#12 అల్లు అర్జున్, అల్లు శిరీష్
దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఏబిసిడి సినిమాలో కనిపించారు అల్లు శిరీష్. తర్వాత చేయబోయే ప్రేమ కాదంట సినిమా షూటింగ్ దశలో ఉంది.
#13 మంచు విష్ణు, మంచు మనోజ్
విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా ఇటీవలే విడుదలయ్యింది. మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి సినిమా షూటింగ్ దశలో ఉంది.
#14 బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్
పవన్ సదినేని దర్శకత్వంలో వచ్చే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు బెల్లంకొండ గణేష్.
#15 ప్రభాస్, ప్రమోద్ ఉప్పలపాటి
ప్రమోద్ యు.వి.క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటారు.
వీరే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎంతో మంది అన్నదమ్ములు, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.