బాలయ్య బాబు హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే షో ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే. ఆహ ఓటిటి లో ఈ షో ప్రసారం కానుంది.. ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ షో ను డైరెక్ట్ చేస్తున్నారు. నవంబర్ 4 వ తేదీ నుంచి ఆహ ఓటిటి లో ఈ షో ప్రసారం అవుతుంది. అయితే.. ఈ షో కు ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు విచ్చేసారు.
నిన్న మొన్నటివరకు ఫస్ట్ గెస్ట్ గా చిరంజీవి హాజరు కాబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. వాస్తవంలో మొదటి గెస్ట్ గా మంచు కుటుంబం నుంచి మోహన్ బాబు హాజరు అవుతున్నారు. మోహన్ బాబు బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేసారు. ఆ తరువాత… వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ సరదాగా నడిచినట్లు తెలుస్తోంది. ఓ టైములో బాలకృష్ణ అల్లుడి ఓటమికి తానే కారణం అని మోహన్ బాబు వ్యాఖ్యలు చేసారు. ఈ విషయాల గురించి ఇంటర్వ్యూ లో ఏమైనా ప్రస్తావన వచ్చిందా లేదా? అన్న విషయమై అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. మరో వైపు బాలయ్య కోపం గురించి అందరికి తెలిసిందే. మరి.. ఇంటర్వ్యూ ని బాలయ్య ప్రశాంతంగానే ముగించారా..? అన్న సందేహాలు కూడా ఫ్యాన్స్ కి కలుగుతున్నాయి.