బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది రోజుకో కంటెంట్ తో హౌస్ లోని కంటెస్టెంట్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లని కంటెస్టెంట్స్ విజయవంతగా పూర్తి చేస్తున్నారు వీరి మధ్య హీట్ కూడా అంతే ఎక్కువ ఉంది ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ తో ఇంట్రెస్టింగ్ గా ముందుకి తీసుకెళ్లే దిశగా వెళుతున్నారు కంటెస్టెంట్స్.

ఈ వారం ఎలిమినేషన్ విషయమై కూడా ఆసక్తి నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో లో నాగార్జున చీకట్లో కనిపించి అందరిని భయపెట్టేసారు. ఈ సారి నామినేషన్స్ లో ప్రియ, లహరి, శ్రీ రామచంద్ర, మానస్, ప్రియాంక ఉన్న సంగతి విదితమే. అయితే.. వీరిలో శ్రీ రామచంద్ర, మానస్, ప్రియాంక లను నాగ్ సేవ్ చేసేసారు. ఇక నామినేషన్స్ లో మిగిలింది ప్రియ, లహరి. ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం లహరి ఎలిమినేట్ అవనున్నారని తెలుస్తోంది. రవి ఆడిన టాస్క్ లో ప్రియ మాటలని లహరి అపార్ధం చేసుకుంది. అలాగే..లహరి ఎక్కువ రవి వెనకే తిరుగుతోంది అని కూడా టాక్ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ వారం ఆటలో లహరి హైలైట్ అయినప్పటికీ.. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ప్రోమో లో నాగార్జున చీకట్లో కనిపించారు. రెండు చేతులతోనూ రెడ్ లైట్ ను పట్టుకుని కనిపించారు. రెండు లైట్లలో ఒకదానిపై ప్రియ పేరు, మరోదానిపై లహరి పేరు ఉన్నాయి. ఎవరి పేరు ఉన్న లైట్ ముందు వెలుగుతుందో వారు సేవ్ అయినట్లు లెక్క. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అన్న సంగతి తేలాల్సి ఉంది.
Watch Video:
























