యాంకర్, యాక్టర్ అయిన తుమ్మల నాగేశ్వర రావు, అలియాస్ టిఎన్నార్ గారు గత మే నెలలో కరోనా కారణం గా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తీరని లోటు గా మిగిలిపోయింది. భిన్నమైన ఇంటర్వ్యూ లతో ఆయన ప్రజలకు చేరువయ్యారు. డైరెక్టర్ కావాలనేది ఆయన కల. ఆ కల తీరకుండానే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.

ఆయనది అందరితోనూ సులువు గా కలిసిపోయే మనస్తత్వం. ఆ మనస్తత్వమే ఆయనను మరింత మందికి చేరువ చేసింది. ఆయన డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పటికీ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అలానే.. పలు సినిమాలలో సహాయ నటుడిగా కూడా కనిపించి మెప్పించారు. హిట్, జార్జ్ రెడ్డి, ఉమామహేశ్వరస్య ఉగ్ర రూపస్య, సుబ్రమణ్య పురం, ఫలక్ నామా దాస్, నేనే రాజు నేనే మంత్రి, జాతి రత్నాలు వంటి సినిమాలలో ఆయన నటించారు.

కరోనా కారణం గా ఆయన అకస్మాత్తు గా మృతి చెందడం తో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ స్టేజి షో పై మాట్లాడిన ఆయన తనయుడు ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఆయనకు ముగ్గురు మొనగాళ్లు సినిమా అంటే చాలా ఇష్టం అని.. ఎప్పుడు ఆ సినిమాని కలిసి చూద్దాం అనే వారని గుర్తు చేసుకున్నాడు. చాలా మిస్ అవుతున్నాం నాన్న.. మాకోసం తిరిగి రావా అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే స్టేజి మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.
Watch Video:






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14



















































































































































































