జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర అయినా సరే ఎంతో ఈజీగా నటిస్తారు. ఎలాంటి డాన్స్ అయినా సరే సులభంగా చేస్తారు. అలాగే తన సింగింగ్ టాలెంట్ కూడా చూపించి ఆల్రౌండర్ అనిపించుకున్నారు ఎన్టీఆర్. ఇవన్నీ మాత్రమే కాకుండా బిగ్ బాస్ హోస్ట్ గా కూడా మనల్ని అలరించారు.
మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో మనందరికీ తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ కూడా తన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగ్స్ తో వీకెండ్ లో స్టార్ మా టిఆర్పి ఒక రేంజ్ కి వెళ్లేలా చేశారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు రాబోతున్నారు.
జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వ్యవహరించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో కొన్ని నెలల క్రితం విడుదల అయ్యింది. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలవబోతోంది. ఈ ప్రోగ్రాంకి మొదటి గెస్ట్ గా ఎవరు వస్తారు అనే ప్రశ్న అందరిలో నెలకొంది.
ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకి మొదటి గెస్ట్ గా రాబోతున్న వ్యక్తి మరెవరో కాదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ఈ ప్రోగ్రాంకి మొదటి గెస్ట్ గా రాబోతున్నారు అనే వార్త అయితే బలంగా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.