సెలెబ్రిటీస్ గురించిన ఏ విషయం అయినా మనకు ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. అందులోను.. ఒక సెలెబ్రిటికి, మరొక సెలెబ్రిటీ కి మధ్య ఉండే బంధుత్వం గురించి అంటే క్యూరియాసిటీ ఉండడం సహజం. నటుడు శ్రీహరి ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నేటికీ.. ఆయన మన మధ్యనే ఉన్నారన్న భావాన్ని ఆయన సినిమాలు కలగచేస్తుంటాయి.
మరో నటుడు ప్రకాష్ రాజ్ కూడా అంతే.. తండ్రి గా, విలన్ గా ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలలో మరొకరిని ఉహించుకోలేము. అంత గా జీవిస్తారాయన. అయితే.. ప్రకాష్ రాజ్, మరియు శ్రీహరి ల మధ్య బంధుత్వం ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఈ వరస ఎలా కలుస్తుంది అంటే.. ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరు తోడల్లుళ్లు.
ప్రకాష్ రాజ్ గారి మొదటి భార్య ఓల్గా లలిత కుమారి. ఆమె ఎవరో కాదు.. శ్రీహరి భార్య “డిస్కో శాంతి” గారి చెల్లెలు. అలా వీరిద్దరూ తోడల్లుళ్లు అయ్యారు అన్నమాట. బృందావనం సినిమాలో.. తన ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజ్ ను చూసిన శ్రీహరి “నాయనా..! అన్నొచ్చిండు” అంటూ అరుస్తారు. నిజ జీవితం లో కూడా వీరు అన్నదమ్ములే. ప్రకాష్ రాజ్ గారు, లలిత కుమారి గారు కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు. కానీ, ఆ తరువాత కూడా శ్రీహరి, ప్రకాష్ రాజ్ ల మధ్య అదే సాన్నిహిత్యం కొనసాగింది.