ప్రముఖ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్, అలాగే టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ లిస్ట్ లో మనకి తెలిసిన ఎంతో మంది సెలబ్రిటీలు ఉంటారు. కేవలం సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా క్రీడా రంగానికి చెందిన వారు, అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు లిస్ట్ లో ఉంటారు.
లిస్ట్ ని సినిమాల వారికి సపరేట్ గా, టీవీ రంగానికి చెందిన వారికి సపరేట్ గా అనౌన్స్ చేస్తారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించే ప్రతి భాషకి ఆ, ప్రాంతానికి చెందిన సెలబ్రిటీలతో ఈ లిస్ట్ తయారు చేస్తారు. అంటే కన్నడ భాషకు చెందిన ప్రముఖులకి, తెలుగు భాషకు చెందిన ప్రముఖులకి, తమిళ్ భాషకు చెందిన ప్రముఖులకి ఇలా సపరేట్ సపరేట్ గా ఉంటుంది. ఏ భాషకు చెందిన లిస్ట్ ని ఆ భాష యొక్క టైమ్స్ పేపర్ లో ప్రచురిస్తారు.
అంటే మన తెలుగుకి చెందిన లిస్ట్ ని హైదరాబాద్ టైమ్స్ లో ప్రచురిస్తారు. అలా 2020 సంవత్సరానికి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ లిస్ట్ ని విడుదల చేశారు. తమిళ్ లో సమంత అక్కినేని, తెలుగులో శృతి హాసన్, కన్నడలో రష్మిక మందన, మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్ గా నిలిచారు. అయితే హైదరాబాద్ టైమ్స్, చెన్నై టైమ్స్, బెంగళూరు టైమ్స్ లిస్ట్ లో కామన్ గా ఉన్న పేరు రష్మిక మందన.
హైదరాబాద్ టైమ్స్ లిస్ట్ లో 5వ స్థానంలో నిలవగా బెంగళూరు టైమ్స్ లిస్ట్ లో మొదటి స్థానంలో, చెన్నై టైమ్స్ లిస్ట్ లో నాలుగవ స్థానంలో నిలిచారు. ఇలా మూడు లిస్ట్ లలో కామన్ గా అది కూడా టాప్ ఫైవ్ లో నిలిచే అరుదైన ఘనత దక్కించుకున్నారు రష్మిక మందన. రష్మిక మందన ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు.