ఇటీవల కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు రష్మిక మందన్న. 2020 మొదట్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ అవ్వగా, తర్వత భీష్మ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది.

కార్తీ తో సుల్తాన్ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ అనే వార్త వినిపిస్తోంది. అయితే రష్మిక కి ఒక అరుదైన గుర్తింపు లభించింది. ఒక సారి గూగుల్ లో “నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా (national crush of India) అని టైప్ చేసి చూడండి. అందులో రష్మిక పేరు చూపిస్తుంది.

ఇంకొక విషయం ఏంటంటే ఇది స్వయంగా గూగుల్ డిక్లేర్ చేసింది. రష్మిక తెలుగులో, కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు తమిళ్ లో కూడా నటిస్తున్నారు. కానీ గీత గోవిందం, డియర్ కామ్రేడ్, చలో, ఇంకా కొన్ని సినిమాలను హిందీలో డబ్ చేశారు.

అలా డబ్బింగ్ సినిమాల ద్వారా రష్మిక, హిందీ ప్రేక్షకులకి కూడా సుపరిచితులు అయ్యారు. దాంతో రష్మిక క్రేజ్ నార్త్ సైడ్ కూడా పాకింది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తరచుగా యాక్టివ్ గా ఉంటారు రష్మిక మందన్న. ఇంతకు ముందు ఈ గుర్తింపును మానుషి చిల్లర్, ప్రియా ప్రకాష్ వారియర్ సంపాదించారు. ఇప్పుడు ఈ జాబితాలో రష్మిక కూడా నిలిచారు.





































చరణ్ గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. పోస్టుమార్టం రిపోర్ట్ లో చరణ్ మద్యానికి బానిస అవడంతో లివర్ పూర్తిగా పాడైపోయింది. ఆ కారణంగా చరణ్ మృతి చెందారు అని డాక్టర్లు పేర్కొన్నారు. చరణ్ కి, అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియకి వివాహం జరిగిన విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. సుప్రియ కూడా ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు.
2015 లో బజరంగీ భాయిజాన్ సినిమాతో, సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. తర్వాత నాస్తిక్ అనే ఒక సినిమాలో నటించింది.
దివాలి సందర్భంగా పండుగను జరుపుకుంటున్న ఫోటోలను ఇటీవల హర్షాలీ మల్హోత్రా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత హర్షాలీ మల్హోత్రా మళ్లీ మన ముందుకు రావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#2
#3
#4



రాజీవ్ కనకాల ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన విషాదంపై రాజీవ్ కనకాల మాట్లాడుతూ “ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యులని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ జీవితం అన్నాక ఇవన్నీ తప్పవు అని ధైర్యం తెచ్చుకున్నాం.
తనకి క్యాన్సర్ సోకిన తర్వాత మెల్లగా అనారోగ్యం నుండి కోలుకుంటోంది ఇప్పుడు సేఫ్ అనుకుంటున్నాం. నేను మధురైలో నారప్ప షూటింగ్ లో ఉన్నాను. లాక్ డౌన్ కి రెండు రోజుల ముందు నేను వచ్చాను. మా బావ ఫోన్ చేసి పాపాయికి బాలేదు అని చెప్పారు. నేను వెంటనే వెళ్లాను. నా చెల్లెలు బతికే ఛాన్సెస్ లేవు అన్నారు. ఆ సమయంలో తనకి జాండీస్ రావడంతో జాండీస్ తగ్గేంతవరకు కీమోథెరపీ కష్టం అన్నారు. తరువాత రెండు రోజుల్లో శ్రీలక్ష్మి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
మా మేనకోడళ్ళు ఇద్దరు ధైర్యవంతులు. చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళని మా ఇంటికి తీసుకువద్దామని అనుకున్నాం. కానీ వాళ్లకు వాళ్ల ఇంటితో ఉన్న అనుబంధం కారణంగా రాము అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు. మేము వాళ్లతో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాం. సుమతో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు” అని అన్నారు.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#15
