మోడల్ గా పరిచయం అయ్యి తర్వాత హీరోయిన్ గా మారిన నటులు చాలామందే ఉన్నారు.అయితే రవిబాబు దర్శకత్వం వహించిన అవును చిత్రంలో నటించిన పూర్ణ కూడా ఇదే కోవకు చెందుతారు.ఈమధ్యకాలంలో హీరోయిన్ పూర్ణ పై ఓ నలుగురు సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్ట్‌లు పెడుతూ పూర్ణ ను డబ్బులు ఇవ్వలసిందిగా డిమాండ్ చేసారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..

కేరళ కు చెందిన పూర్ణ మొదటగా “శ్రీ మహాలక్ష్మి” చిత్రంతో పరిచయం అయినా అవును చిత్రంతో ప్రేక్షకులందరికీ గుర్తిండిపోతారు.ఈమధ్య కాలంలో సినిమా ఆఫర్స్ లేక ఖాళీగానే ఉన్నారు పూర్ణ.దీంతో ఎప్పటినుండో పూర్ణ కు పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు పూర్ణ కుటుంబ సభ్యులు.అయితే ఈ సమాచారం తెలుసుకున్న నిందితులు పెళ్లి సంబంధం ఉంది అంటూ పూర్ణ ఇంటికి చేరుకొని పూర్ణ పర్సనల్ నెంబర్ కూడా తీసుకున్నారని సమాచారం.అయితే నిందితులు పూర్ణ మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతూ వచ్చారు. ఇలాంటి పోస్ట్‌లు ఆపాలంటే మేము కోరినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతె ని కెరీర్ నాశనం చేస్తామని పూర్ణ ని బెదిరించారు నిందితులు.

అయితే మొదట నుండి అవి అన్ని భరిస్తూ వస్తుంది పూర్ణ.కానీ ఈ మధ్య వారి ఆగడాలు మరి శృతి మించడంతో పోలీసులను ఆశ్రయించారు పూర్ణ.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం నిందితులు బెంగుళూరు నుంచి ఆన్లైన్ లో పోస్ట్ చేసారని తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులు బెంగుళూర్ కు చెందిన అష్రాఫ్ ,శరత్,రఫీక్,రమేష్ అని పోలీసులు వెల్లడించారు.ఈ నలుగురి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు పోలీసులు.అయితే ఈ నలుగురు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.













చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ , తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమెడియన్ సునీల్ హీరో ఉదయ్ కిరణ్ ల ది సూపర్ హిట్ కాంబో. చిత్రం, నువ్వునేను,మనసంతా నువ్వే ఇలా ఎన్నో చిత్రాల్లో సునీల్ ఉదయ్ కిరణ్ తో కలిసి నటించారు. ప్రేక్షకులని మెప్పించారు . ప్రేక్షకులని నవ్వించడమే కాదు మనసంతా నువ్వే సినిమాలో ఇద్దరి నటనతో ఏడిపించారు కూడా.
అప్పటి జ్ణాపకాలను తలుచుకుని సునీల్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే .. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ అథ్లెట్ కదా . చదువులో సున్నా మార్కులు , స్పోర్ట్స్‌లో మాత్రం ఫ్రైజులన్ని ఉదయ్ వే . ఆ సీన్స్ ఇప్పటికి చాలా ఫన్నీగా ఉంటాయి , మనల్ని నవ్విస్తాయి . నిజానికి సినిమా షూటింగ్ సంధర్బంలో తేజా ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో మనకు తెలిసిందే . సీన్ ఫర్ఫెక్ట్ గా రాకపోతే నటీనటులని కొడతారని కూడా టాక్. ఇప్పడు విషయం అది కాదు.
నువ్వు నేను సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక రన్నింగ్ రేసు సీనుంటుంది. ఆ సీన్లో రన్నింగ్ చేయడం కోసం అందరూ స్టేట్ రన్నర్స్ నే తీసుకున్నారంట తేజ . పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ పొందుతూ , అక్కడ రన్నింగ్‌లో ఫస్ట్ ,సెకండ్ వచ్చిన వాళ్లంట . వాళ్లతో షాట్ ఉదయ్ రన్ చేయాలి . వాళ్లందరిని కూడా బీట్ చేసి ఉదయ్ ఫస్టొచ్చారట . అసలెలా? అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తావ్ అని సునీల్ , ఉదయ్ ని అడిగితే “నేను చిన్నప్పటి నుండి సిటీ బస్సుల వెనక పరిగెత్తేవాన్ని అన్నారట” నిజంగా హౌ ఫన్నీ కదా .























