Presenting the Official Telugu Trailer of CHAKRA released at a time in four south Indian languages, Telugu, Tamil, Malayalam and KannadaStarring Vishal,Directed by MS Anandan, music by Yuvan Shankar Raja ,the film features Vishal, Shraddha Srinath and Regina Cassandra in the lead roles. Srushti Dange, Manobala and Robo Shankar form the supporting cast.lets Watch Vishal “CHAKRA” Movie Official Telugu Trailer Here.
Filmy Adda
మోడల్ గా పరిచయం అయ్యి తర్వాత హీరోయిన్ గా మారిన నటులు చాలామందే ఉన్నారు.అయితే రవిబాబు దర్శకత్వం వహించిన అవును చిత్రంలో నటించిన పూర్ణ కూడా ఇదే కోవకు చెందుతారు.ఈమధ్యకాలంలో హీరోయిన్ పూర్ణ పై ఓ నలుగురు సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్ట్‌లు పెడుతూ పూర్ణ ను డబ్బులు ఇవ్వలసిందిగా డిమాండ్ చేసారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..

కేరళ కు చెందిన పూర్ణ మొదటగా “శ్రీ మహాలక్ష్మి” చిత్రంతో పరిచయం అయినా అవును చిత్రంతో ప్రేక్షకులందరికీ గుర్తిండిపోతారు.ఈమధ్య కాలంలో సినిమా ఆఫర్స్ లేక ఖాళీగానే ఉన్నారు పూర్ణ.దీంతో ఎప్పటినుండో పూర్ణ కు పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు పూర్ణ కుటుంబ సభ్యులు.అయితే ఈ సమాచారం తెలుసుకున్న నిందితులు పెళ్లి సంబంధం ఉంది అంటూ పూర్ణ ఇంటికి చేరుకొని పూర్ణ పర్సనల్ నెంబర్ కూడా తీసుకున్నారని సమాచారం.అయితే నిందితులు పూర్ణ మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతూ వచ్చారు. ఇలాంటి పోస్ట్‌లు ఆపాలంటే మేము కోరినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతె ని కెరీర్ నాశనం చేస్తామని పూర్ణ ని బెదిరించారు నిందితులు.

అయితే మొదట నుండి అవి అన్ని భరిస్తూ వస్తుంది పూర్ణ.కానీ ఈ మధ్య వారి ఆగడాలు మరి శృతి మించడంతో పోలీసులను ఆశ్రయించారు పూర్ణ.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం నిందితులు బెంగుళూరు నుంచి ఆన్లైన్ లో పోస్ట్ చేసారని తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులు బెంగుళూర్ కు చెందిన అష్రాఫ్ ,శరత్,రఫీక్,రమేష్ అని పోలీసులు వెల్లడించారు.ఈ నలుగురి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు పోలీసులు.అయితే ఈ నలుగురు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
“నడిరోడ్డుపై నన్ను ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించారు”…రెజీనా సంచలన కామెంట్స్.!!!
ఆడవాళ్ళకి వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం మనం నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో చూస్తూనే ఉంటాము…అది ఎలా పెరిగిపోయిందంటే..గతంలో ఎక్కడో ఒక చోట…కొన్ని సార్లు మాత్రం జరిగే..ఇలాంటి ఘటనలు..ఇప్పుడు ప్రతి రోజు మనకు తారస పడుతూనే ఉన్నాయి..నిజానికి చట్టాల్లో ఎన్ని మార్పులు తెచ్చిన కూడా ఆకతాయిలు తమ పనులు మానుకోవాటంలేదు…నిజానికి మార్పులు చట్టాల్లో కాదు..మనుషుల్లో రావాలి.! చరవాణీలు,అంతర్జాలాలు పెరిగిపోయిన తరువాత మరింత శృతి మించి పోతున్నారని చెప్పాలి..

అమ్మాయిల మీద వేధింపులు సామాన్యులకే కాదు..సెలెబ్రెటీలు కూడా బాధితులే..! వారు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలలో వారి లైఫ్ కి సంబంధించి చీకటి ఘటనలు మీడియా తో… చెబుతూ ఉంటారు..ఇలాంటి ఒక చెడు ఘటనే స్టార్ హీరోయిన్ రేజీనాకి ఎదురైన సందర్భాలు ఉన్నాయని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.తన కాలేజీ,స్కూల్ సమయాల్లో ఎదురైన సంఘటనల గురించి తెలుపుతూ.

‘నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చెన్నైలోని ఈగ థియేటర్ బ్రిడ్జి వద్ద కొందరు యువకులు దుర్భాషలాడారు ఒక యువకుడు తన శరీరం పై చెప్పుకోలేని చోట చెయ్యి తో తాకే ప్రయత్నం కూడా చేసాడు..నా పెదవులపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు..తనకు జరగరాని ఘటన ఏదో జరుగబోతుందని ముందే గమనించి ..ఎదురించే ప్రయత్నం చేశాను..!

స్కూల్ లో కూడా ఇలాంటి కొన్ని ఘటనలే ఎదురయ్యాయి..! అవతల వారిని ఎదురించే అంత బలం నాలో ఉండేది కాదు..ఇలాంటి ఘటనలు కొన్ని ఎదురయ్యాక ఇక ఒక నిర్ణయానికి వచ్చేసా శారేరకంగానే కాదు మానసికంగా కూడా దృడంగా మారాలి అని.దీనితో కసరత్తులు మొదలు పెట్టాను.శరీరంకంగా దృడంగా మారాను.! .అప్పటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ ఒంటరిగా కాకుండా స్నేహితులతో వెళ్లే దాన్ని..మునుపటి తో పోలిస్తే నేటి కాలం యువతులకు మరిన్ని సమస్యలు ఎక్కువయాయ్యి.అనే చెప్పాలి.రోజుకో కొత్త టెక్నాలజీలు పుట్టుకు రావడంతో కొత్త రూపం లో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.
ఆర్ ఆర్ ఆర్ కి షూటింగ్ కష్టాలు తప్పడంలేదు.అన్ని సరిచేసుకుంటున్న సమయంలో ఏదో ఒక రూపేనా ఇబ్బందులు ఎదురుపడుతున్నాయి.ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ …కరోనా వైరస్ వలన వచ్చిన లాక్ డౌన్ కారణంగా..షూటింగ్స్ ,వాయిదా పడటంతో..చిత్రీకరణకు మరింత ఆలస్యం ఏర్పడుతుంది.

షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాల పెండింగ్ ఉండటం..ఎక్కడ కదలలేని పరిస్థితుల్లో ఉండటం…తో ఎప్పటికి పూర్తి చేస్తారో.ఇప్పుడే చెప్పలేము అంటున్నారు..యూనిట్.సినిమా ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.

ఇందుకోసం భారీగా విదేశీ తారాగణం కూడా అవసరం ఉంది అయితే విదేశాల్లో కరోనా మరింత విజృంబిస్తు ఉండటం వలన అక్కడ వారిని పిలిపించలేని పరిస్థితి నెలకొన్నది..షూటింగ్ కి అనుమతులు ఇచ్చిన కూడా తెలంగాణ లో కరోనా విస్తరణ భారీగా ఉండటం..తో మళ్ళీ పునరాలోచనలో పడ్డారు నిర్మతలు..ముఖ్యంగా హైదరాబాదులో లో రోజు రోజుకి ఇంకా కేసుల సంఖ్య పరుగుతూ ఉండటం..మరింత కలవర పెడుతుంది,చరణ్ కూడా షూటింగ్ వాయిదా వేయడమే మంచిది అనే అంటున్నారట..ఎన్టీఆర్ కూడా ఇదే నిర్ణయం మీదే ఉన్నారని తెల్సుతుంది.దీనితో జనవరి లో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం కష్టమనే అర్థమవుతుంది.
also Read : మళ్లీ బాలయ్యను టార్గెట్ చేసిన హైపర్ ఆది…ఫైర్ అవుతున్న బాలయ్య ఫాన్స్..!
కరోనా నేపథ్యంలో…తెలుగు బిగ్ బాస్ హౌస్ సెట్లో చేయబోతున్న మార్పులు ఇవేనట ..!
బిగ్ బాస్ ఇహ్ ప్రోగ్రాం ఉత్తరాదిన ఫేమస్ అయ్యి..తెలుగు రాష్ట్రాలకి పాకిన ఫివర్ ! తెలుగు లోని ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్స్ ని విజయవంతగా పూర్తిచేశారు..బిగ్ బాస్ ప్రసారం అవుతున్న వారాల్లో..చానెల్స్ కి విపరీతంగా TRP రేటింగ్స్ పెరిగిపోతూ ఉండటం మనం గమనించాం..మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ..రెండో సీజన్ కి నాని,మూడో సీజన్ కి నాగార్జునలు వ్యవహరించిన సంగతి తెలిసిందే.కరోనా నేపథ్యం లో ఈ ఏడాది..బిగ్ బాస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి..

అయితే నిర్వాహకులు సీజన్ ని లాంచ్…చేయడానికే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.ఇంతకు ముందు ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్ కి కొన్ని మార్పులు చేయబోతున్నారట.బెడ్ రూమ్స్ నుంచి బాత్ రూమ్ వరకు అన్ని మార్పులు చేస్తున్నారట…గతం లో లాగ బెడ్ షేరింగ్ ఉందట..కరోనా నేపథ్యం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ప్రతీ సీజన్ ని 100 రోజులు…నిర్వహించే వారు ఈసారి కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందట.
Also Read : బిగ్ బాస్ షోపై “ఝాన్సీ” సంచలన కామెంట్స్…తెలిసితెలిసి పళ్ళు రాలగొట్టుకుంటారా?

బిగ్ బాస్ సీజన్ 4 ని కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ 4 పార్టిసిపెంట్స్ పేర్లు ఇప్పటికే చాలా వరకు ప్రచారం లో ఉన్నాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా ముగించారట…మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ 4: 10 మంది కంటెస్టెంట్స్ వీరేనా?
కొడుకు మృతిపై మొదటిసారి నోరువిప్పిన సుశాంత్ తండ్రి…చివరగా ఏం మాట్లాడారంటే.?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రోజు నుండి మీడియా తన కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ వాళ్ళు బాధ లో ఉండడం వల్ల మాట్లాడనికి ఇష్ట పడలేదు. ఇటీవల సుశాంత్ తండ్రి కే కే సింగ్ మీడియా తో మాట్లాడారు.

“ఎన్నో ప్రార్థనలు చేస్తే పుట్టాడు సుశాంత్. నలుగురు అమ్మాయిల లో ఒక్కడే అబ్బాయి తను. మూడేళ్లు ప్రార్థన చేసిన తర్వాత పుట్టాడు. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా కావాలనుకుంటే అదే తొందరగా దూరమవుతుంది. సుశాంత్ విషయం లో అలానే జరిగింది.
సుశాంత్ ఇంత చిన్న వయసు లో నే చాలా చేసాడు. చాలా సాధించాడు. కుటుంబం తో చాలా క్లోజ్ గా ఉండేవాడు. అన్నీ చెప్పుకునేవాడు. సినిమాల నుండి తన వ్యక్తిగత జీవితం లో ఏం అవుతుంది అనే ప్రతి విషయం మాతో చెప్పేవాడు. కానీ ఇలా ఎందుకు చేసాడో అర్ధం కావట్లేదు. ఇంక అయినదాన్ని ఎవరు ఆపగలం.

తను చివరిగా నాతో మాట్లాడినప్పుడు తన పెళ్లి విషయం వచ్చింది. కరోనా కారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పెళ్లి చేసుకోవడం కష్టమని. తర్వాత తనకి సినిమా షూటింగ్ ఉంది అని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో చేసుకుంటానని చెప్పాడు. అదే చివరి సారి తనతో నేను మాట్లాడటం.

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటివి అవుతుండవచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా ఎదిగినప్పుడు ఓర్వ లేక పోవడం, వాళ్లని కిందకి లాగాలి అని ప్రయత్నం చేయడం, వాళ్ల మీద లేనిపోని మాటలు చెప్పడం. ఇలాంటి ఎన్నో జరుగుతుండవచ్చు” అని అని చెప్పారు.

సుశాంత్ కి ఎంతో సన్నిహితురాలైన అంకిత గురించి మాట్లాడుతూ “అంకిత మాతో మాట్లాడడానికి ముంబై వచ్చింది. పాట్నా కి కూడా వచ్చి మమ్మల్ని కలిసింది. అంకిత పై మాకు ఎటువంటి చెడు అభిప్రాయమూ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి బ్రేకప్ విషయం వాళ్లు ఆలోచించి మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. దాన్ని మేము గౌరవిస్తాం” అని అన్నారు సుశాంత్ తండ్రి కే కే సింగ్.
ఉదయ్ కిరణ్ గురించి సునీల్ బయటపెట్టిన విషయం ఇది..! తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!
ఉదయ్ కిరణ్ చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ డమ్ చూసిన అతి కొద్దిమంది హీరోల్లో ఒకరు . వరుస హిట్లు , స్టార్ హీరోగా క్రేజ్, అభిమానుల ఫాలోయింగ్ , ఛాక్లెట్ బాయ్ గా ఇప్పటికి అమ్మాయిల మనసుల్లో ఉదయ్ కిరణ్ స్థానం పదిలం .అమ్మాయిలతో సమానంగా అబ్బాయిలు కూడా ఉదయ్ కిరణ్ ని ఇష్టపడేవాళ్లు . అర్దాంతరంగా ఆగిపోయిన కెరీర్ తో తన జీవితానికి తనే చెక్ పెట్టుకుని బలవన్మరం పొందాడు. ఉదయ్ కిరణ్ తో ఎన్నో సినిమాల్లో నటించిన సునీల్ ఉదయ్ ని గుర్తు చేసుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.
చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ , తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమెడియన్ సునీల్ హీరో ఉదయ్ కిరణ్ ల ది సూపర్ హిట్ కాంబో. చిత్రం, నువ్వునేను,మనసంతా నువ్వే ఇలా ఎన్నో చిత్రాల్లో సునీల్ ఉదయ్ కిరణ్ తో కలిసి నటించారు. ప్రేక్షకులని మెప్పించారు . ప్రేక్షకులని నవ్వించడమే కాదు మనసంతా నువ్వే సినిమాలో ఇద్దరి నటనతో ఏడిపించారు కూడా.
అప్పటి జ్ణాపకాలను తలుచుకుని సునీల్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే .. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ అథ్లెట్ కదా . చదువులో సున్నా మార్కులు , స్పోర్ట్స్‌లో మాత్రం ఫ్రైజులన్ని ఉదయ్ వే . ఆ సీన్స్ ఇప్పటికి చాలా ఫన్నీగా ఉంటాయి , మనల్ని నవ్విస్తాయి . నిజానికి సినిమా షూటింగ్ సంధర్బంలో తేజా ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో మనకు తెలిసిందే . సీన్ ఫర్ఫెక్ట్ గా రాకపోతే నటీనటులని కొడతారని కూడా టాక్. ఇప్పడు విషయం అది కాదు.
నువ్వు నేను సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక రన్నింగ్ రేసు సీనుంటుంది. ఆ సీన్లో రన్నింగ్ చేయడం కోసం అందరూ స్టేట్ రన్నర్స్ నే తీసుకున్నారంట తేజ . పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ పొందుతూ , అక్కడ రన్నింగ్‌లో ఫస్ట్ ,సెకండ్ వచ్చిన వాళ్లంట . వాళ్లతో షాట్ ఉదయ్ రన్ చేయాలి . వాళ్లందరిని కూడా బీట్ చేసి ఉదయ్ ఫస్టొచ్చారట . అసలెలా? అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తావ్ అని సునీల్ , ఉదయ్ ని అడిగితే “నేను చిన్నప్పటి నుండి సిటీ బస్సుల వెనక పరిగెత్తేవాన్ని అన్నారట” నిజంగా హౌ ఫన్నీ కదా .
అంతే కాదు ఉదయ్ నేచర్ కూడా అంతే ఫన్నీగా ఉండేదట . ఫన్నీగా మాట్లాడడం అందరితో కలిసి పోవడం ఆ విషయాల్నింటిని సునీల్ ఇటీవల ఒక టీవి ప్రోగ్రాం లో గుర్తుచేసుకున్నారు. ఎక్కడ ఉన్నాడో కానీ బంగారం అంటూ సునీల్ ఉదయ్ ని తలుచుకుని సునీల్ బాధ పడుతుంటే మనకి కన్నీళ్లు ఆగవు .
watch video:
జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆర్టిస్ట్ లు ఆ “గ్రీన్ రిబ్బన్” ఎందుకు కట్టుకున్నారో.?
బుల్లితెరపై ఎంతో జనాధారణ కలిగిన కామెడీ షో జబర్దస్త్ షూటింగ్ తిరిగి మళ్ళీ మొదలైంది.కాగా రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్స్ ప్రోమోస్ ను ఇటీవల ఈటీవీ విడుదల చేసింది.అయితే అందులో కొంతమంది కమెడియన్లు చేతికి గ్రీన్ బ్యాండ్ కట్టుకొని ఉన్నారు.దీంతో అసలు జబర్దస్త్ కమెడియన్స్ ఎందుకు ఆలా గ్రీన్ బ్యాండ్స్ ధరించారు అని ప్రేక్షకులలో పెద్దగా చర్చలు మొదలయ్యాయి .ఆ వివరాలేంటో చూద్దాం ..

తాజాగా విడుదల అయిన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలలో కొంతమంది గ్రీన్ బ్యాండ్స్ కట్టుకున్నారు.కానీ కొంతమంది మాత్రం గ్రీన్ బ్యాండ్స్ కట్టుకోలేదు.అసలు గ్రీన్ బ్యాండ్స్ ధరించడం వెనకాల గల కారణాలు ఏమి అయ్యుండచ్చు అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.ఈ గ్రీన్ బ్యాండ్స్ జబర్దస్త్ లో ఎందుకు ధరించారు అని తెలుసుకోవడానికి పలు ప్రయత్నాలు చేసిన నెటిజన్స్ చివరకి ఏమి తెలుసుకోలేకపోయారు.దీంతో జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ విడుదల అయ్యాక ఈ గ్రీన్ బ్యాండ్స్ ఎందుకు ధరించారో తెలుస్తుంది అని అనుకున్నారు.

కానీ జబర్దస్త్ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఈ గ్రీన్ బ్యాండ్స్ ఎందుకు ధరించారు అనే ప్రస్తావన రాలేదు.దీంతో నెటిజన్లలో గ్రీన్ బ్యాండ్స్ గురించి మొదలైన ప్రశ్న ప్రశ్నలనే మిగిలిపోయింది.కాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు అన్ని కూడా మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే.దాదాపు మూడు నెలల నుండి కొత్త షూటింగ్‌లు ఏమి జరగలేదు.దీంతో చాలా టీవీ షోస్ యొక్క టి ఆర్ పి రేటింగ్స్ బాగా పడిపోయాయి.అయితే తాజాగా కొన్ని నిబంధనలతో మళ్ళీ టీవీ షూటింగ్స్ అన్ని మొదలయ్యాయి.

ఏంటయ్యా వర్మా!!! అలా అడిగేశావు..? మొదట్లో పులిహోర కూడా బాగానే కలిపావుగా..!
భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ .

తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో …రీసెంట్ టైం లో ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించి అని యాంకర్ అడిగితే….చాలా మంది ఉన్నారు…అందులో నువ్వు కూడా ఒకరు. నువ్వు అడిగావు కాబట్టి చెప్పను అని బదులిచ్చారు. అంతేకాకుండా నీకు నా తర్వాత సినిమాలో బికినీలో నటించే ఆఫర్ ఇస్తాను. నీకు ఇష్టమైతే నటించొచ్చు. నాకు నిన్ను అలా చూడాలని వుంది అంటూ ఆఫర్ ఇచ్చేసరికి పాపం.. ఆ లేడీ యాంకర్ కి ఏం చేయాలో అర్ధంకాక నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
రామ్ గోపాల్ వర్మా ఇంటర్వ్యూ అంటే…ఇంటర్వ్యూ కంటే కింద కామెంట్స్ ఇంకా క్రేజీ ఉంటాయి..

RGV Latest Interview Anchor Ariyana Glory Images >> Click Here
బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి…జానీ సినిమా లో పవన్ సరసన నటించి పెళ్లాడిన హీరోయిన్ రేణుదేశాయ్…పెళ్లి తరువాత తిరిగి సినిమాలలో ఎక్కడ కనిపించని రేణు దేశాయ్…పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ సినీ రంగం వైపు అడుగులు వేశారు..మరాఠి లో ఇష్క్ వాలా అనే సినిమాని కూడా నిర్మించారు తాజాగా తెలుగులో కూడా తిరిగి సినిమాలలో బిజీ అవ్వబోతున్నారు..

GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మహేష్ బాబు నిర్మిస్తున్న’మేజర్’ సినిమాలో…ఒక పవర్ ఫుల్ రోల్ ని ఆఫర్ చేశారట..అయితే ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.అడివి శేష్ హీరోగా..శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకు ఎక్కిస్తున్నారు.
ALSO READ : ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఇంతలా ఎలా మారిపోయింది..?

పేరుకి చిన్న పాత్రనే అయినా కూడా పవర్ ఫుల్ రోల్ గా తెరకెక్కించే లా పాత్రను తీర్చిదిద్దబోతున్నారట..ఇప్పటికే రేణుదేశాయ్ దర్శకురాలిగా,నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు కూడా.రేణుదేశాయ్ ఫామిలీ కి అడివి శేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట..ఒకేవేళ రేణు ఒప్పుకుంటే..ఇదో క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం మాత్రం ఖాయం

