యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా డిసెంబర్ నెలలో విడుదల సూపర్ హిట్ గా నిలిచింది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. సలార్ మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో అభిమానులు అందరూ రెండవ భాగం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ లో నటించి సినిమాకు ఉపయోగపడే రోల్ చేసింది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో సలార్ సినిమా కాస్టింగ్ డీటెయిల్స్ లోకి వెళ్తే హీరోయిన్ గా శృతిహాసన్ కి బదులు మీనాక్షి చౌదరి పేరు ఫోటో కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఉండే ట్రోలర్స్ కి ఏదైనా చిన్న తప్పు దొరికితే చాలు ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటారు. ఇప్పుడు ఈ సలార్ సినిమా క్యాస్టింగ్ డీటెయిల్స్ లో మీనాక్షి చౌదరి ఫోటో కనబడడంతో దాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. సలార్ సినిమాలో ఈమెను ఎప్పుడు పెట్టారు నాకు కనిపించలేదు అంటూ మీమ్స్ వేస్తున్నారు. సలార్ సినిమాలో మీనాక్షి చౌదరిని ఎంత వెతికినా కనబడదనే సంగతి అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె నటించలేదు కాబట్టి.

కాకపోతే ఇంటర్నెట్లో జరిగిన ఒక చిన్న తప్పు వల్ల ఇప్పుడు దీన్ని ట్రోల్లింగ్ సలార్ సినిమాలో మీనాక్షి చౌదరిని ఎంత వెతికినా కనబడదనే సంగతి అందరికీ తెలిసింది ఎందుకంటే ఆ సినిమాలో ఆమె నటించలేదు కాబట్టి.కాకపోతే ఇంటర్నెట్ లో జరిగిన ఒక చిన్న తప్పు వల్ల ఇది ఇప్పుడు ట్రోలింగ్స్ కి గురవుతుంది. కాకపోతే మీనాక్షి చౌదరి సలార్ సినిమాలో నటించలేదు గాని..తాజాగా గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమెకి మంచి పేరు వచ్చింది.







మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్‌కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్‌తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్స్టార్డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్‌గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారు
వినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.




నిఖిల్ విజయేంద్ర సింహ పేరు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి సుపరిచితం. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి, కాస్కో అనే సెలబ్రిటీ టాక్ షోతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ హిట్ కావడంతో నిఖిల్ పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. మెగాడాటర్ నిహారిక, మంచు లక్ష్మి, వితిక, హారిక వంటివారికి నిఖిల్ ఫ్రెండ్ కూడా. సినీ సెలెబ్రెటీ పార్టీల్లో నిఖిల్ కనిపిస్తూ ఉంటాడు. నిఖిల్ మూవీ ప్రమోషన్స్ మూవీ యూనిట్ ను ఇంటర్వ్యూలు ఇస్తారు. నిఖిల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటారు.
నిఖిల్ విజయేంద్ర సింహ 1996లో సెప్టెంబర్ 18న విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా, తల్లి ఒక ఎన్జీవో కోసం పనిచేయడమే కాకుండా, ఖాజాగూడలో దిబ్బరోట్టి అనే రెస్టారెంట్‌ను కూడా నిర్వహిస్తోంది. నిఖిల్ 2018లో గీతం యూనివర్శిటీ నుండి బికాం (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. తమ్మడ మీడియాలో పని చేయడం ప్రారంభించాడు. అలా ‘మహతల్లి’ ఛానెల్లో షార్ట్ ఫిల్మ్‌లలో కనిపిస్తూ యాక్టింగ్ లో ప్రవేశించాడు.
2019లో, నిఖిల్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కాస్కో’ని మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే నాలుగు లక్షలమంది సబ్స్క్రైబర్లను సంపాదించాడు. అందులో కంటెంట్, ఛాలెంజ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెలబ్రిటీ హోమ్ టూర్లతో పాటు సెలబ్రిటీలతో ఎంగేజింగ్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. 2020లో, నిఖిల్ తన ఫ్రెండ్ భానుతో కలిసి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాయుడు చిత్రాలు’ స్థాపించాడు. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో వెబ్ సిరీస్‌ని నిర్మించారు. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ యువరాజ్ సింహ నిఖిల్ కి సొంత అన్నయ్య అని సమాచారం.
