మెగా డాటర్ కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్యను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మెగా కుటుంబ అత్యంత వైభవంగా జరిపించింది.అయితే పెళ్లి జరిగి సంవత్సరం గడవక ముందే వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి.
కిందట ఏడాది నిహారిక చైతన్య ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసి విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయం పైన మాట్లాడారు. విడాకులు జరిగాక ఆ బాధను తట్టుకోలేక తాను ప్రతిరోజు ఏడ్చేదానిని అని, విడాకులకి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘర్షణ గురించి వివరించారు.

అయితే దీనిపైన నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య స్పందించారు. ఈ వీడియో పోస్ట్ చేసిన లింక్ కింద ఒక సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. “హాయ్ ఇటీవల నిహారిక ఎదుర్కొంటున్న నెగిటివిటీని దూరం చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత సులభం కాదని నాకు తెలుసు… కానీ పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం, అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలి. ఇలా జరగడం ఇది రెండోసారి… బాధ ఇద్దరికీ ఉంటుంది. ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదు…విడాకుల విషయంలో వారి జోక్యం చేసుకోకూడదు…”

“బాధ నుంచి ఎలా కోలుకున్నామో అనే దాని గురించి మాట్లాడితే అది చాలామందికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటిది చేస్తే… ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి… జరిగిందేంటో తెలుసుకోకుండా జడ్జ్ చేయడం ఎంత తప్పో… ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజలకు ఒకే కోణం ద్వారా చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్న అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా” అని రాసుకొచ్చాడు… ఇప్పుడు ఒక పక్కన నిహారిక ఇంటర్వ్యూ మరోపక్క ఆమె మాజీ భర్త కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమనికి సంబంధించిన ఫొటోలు, రాముడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్నవదనంతో చిరునవ్వును కలిగి, బాల రాముడి విగ్రహం ముగ్ద మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తోంది. రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడంతో అయోధ్య రాముడిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు.
తాజాగా అయోధ్య రాముడి గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తమిళనాడులో హీరోహీరోయిన్ల పై వారి ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటి ఉండడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడ ఆ అభిమానం పరిధులు దాటి వెళ్తోంది. తమిళ లెజెండరి యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్, అయోధ్య బాల రాముడి విగ్రహానికి పోలికలు ఉన్నాయని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
రామ్ లల్లా సుందర ముఖారవిందం పై కోలీవుడ్ లో రచ్చ జరుగుతోంది. బాలక్ రామ్ విగ్రహం కళ్ళు మరియు నవ్వు తమ అభిమాన హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. కళ్లు అచ్చుగుద్దినట్టుగా తమ హీరో కళ్ళలా ఉన్నాయని, విజయ్ కాంత్ కళ్ళను, రాముడి కళ్ళను పోల్చుతూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.










హాయ్ నాన్న మూవీ ఓ తండ్రి, కూతుర్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరి అని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే హీరో వైఫ్ చనిపోవడం, అతనికి ఒక పాప ఉండడం, ఆ పాపకి హీరోయిన్ ఫ్రెండ్ కావడం వంటి సీన్స్ కనిపించాయి. ఇక ఈ గ్లింప్స్ లో నాని కూతురిగా నటించిన పాప పేరు కియారా ఖన్నా.
ఆమె పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది. థాంక్ గాడ్, బందాసింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించింది. కియారాకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తన అక్క మైరాతో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేస్తుంది.
కియారా ఖన్నా తల్లి పేరు శివాని జె ఖన్నా. ఆమె తన పిల్లల పేర్లతో నిర్వహిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 328 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన పిల్లలు మైరా మరియు కియారా ఖన్నా నటించిన వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది. కియారా ఖన్నా మాక్స్ స్ప్రింగ్ యాడ్, క్లబ్ మహీంద్రా మరియు కెన్‌స్టార్ వంటి పలు యాడ్స్ లో నటించింది. ఆమె యూట్యూబ్ ఛానెల్ లో ఈ యాడ్స్ ను చూడవచ్చు.



