చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి. ఎక్కువ మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. నిజానికి డయాబెటిస్ వలన ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ ఎలా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తోంది..?, దీని వలన ఏమవుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఒకవేళ కనుక మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అని గ్రహిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకో వచ్చు. అయితే డయాబెటిస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఇది చాలా సైలెంట్ గా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వలన కొన్ని అవయవాలు కొన్ని శరీర భాగాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
#1. కళ్ళకి ఇబ్బంది:
డయాబెటిస్ వలన కంటికి ఇబ్బంది వస్తుంది. కంటి చూపు తగ్గడం లేదంటే కళ్ళు కనబడకపోవడం వంటి ప్రమాదకరమైన సమస్యలు తలెత్తొచ్చు కనుక జాగ్రత్తగా వుండండి.
#2. హృదయ సంబంధిత సమస్యలు:
కార్డియో వాస్కులర్ సిస్టం పైన కూడా ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. బ్లడ్ పైసల్స్ ని కూడా బ్లాక్ చేయొచ్చు. ఇలా గుండె కి సంబంధించిన సమస్యలు వస్తాయి.
#3. నరాల సమస్యలు:
బ్లడ్ షుగర్ లెవెల్స్ నరాలని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.
#4. కిడ్నీ ఫెయిల్యూర్:
కిడ్నీ ఫెయిల్యూర్ ,కిడ్నీ సమస్యలు కూడా డయాబెటిస్ వలన కలగొచ్చు. ఇలా డయాబెటిస్ ఉన్న వాళ్లు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.