Home Health Adda మానసిక సమస్యలను తొలగించేందుకు.. తప్పక ఈ 4 విషయాలను పాటించండి…!

మానసిక సమస్యలను తొలగించేందుకు.. తప్పక ఈ 4 విషయాలను పాటించండి…!

by Megha Varna

చాలా మంది మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మానసికంగా చాలా రకాల సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మానసికంగా మీరు ఆరోగ్యంగా లేనని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ పద్ధతుల్ని ఫాలో అవ్వండి. అప్పుడు కచ్చితంగా వాటి నుండి బయట పడేందుకు అవుతుంది. మరి మానసిక నిపుణులు మానసిక ఆరోగ్యానికి మేలు చేసే టిప్స్ ని వివరించారు. వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

#1. సమస్యని కనుక్కోండి:

మానసికంగా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మొదట సమస్య ఏమిటి అనేది కనుక్కోండి. ఆ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి. అప్పుడు కచ్చితంగా మీరు మీ మానసిక ఆరోగ్యం ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

#2. వ్యాయామం చేయడం:

దీని వలన కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యాయామం చేయడం వలన ఎండోర్ఫిన్ విడుదల అయ్యి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆనందాన్ని మీకు కలిగిస్తుంది.

walking 3

#3. మీ రొటీన్ ని మార్చుకోండి:

మీ ఉద్యోగంలో కనుక మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే దానిలో ఏమైనా మార్పులు చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ కనుక ఆఫీసులో మీకు ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని రోజులు పాటు ఇంట్లో ఉండి ఏదైనా పని చేయండి. ఇలా మీరు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

#4. కాస్త రాయండి:

పదేపదే మనం ఆలోచనలో పడిపోయి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు సమస్యను రాసి ఉంచితే మళ్ళీ అదే ఇబ్బంది రాదు. దానిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

You may also like