శీతాకాలంలో తరచు మన చర్మానికి మనకి ఏదో ఒక సమస్య వస్తుంది. చర్మం పగిలిపోవడం, విపరీతంగా డ్రై అయ్యిపోవడం లాంటివి. అటువంటి సమస్య నుండి బయట పడి అందంగా కనపడాలంటే ఎక్కువ మంది మార్కెట్లో దొరికే క్రీమ్స్ ను కొనుగోలు చేస్తారు.
చాలా మంది చర్మం పొడి బారిపోతే వాసెలిన్ ని ఉపయోగిస్తారు. వాసెలిన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలానే చాలా సమస్యలు తరిమికొట్టడానికి దీనిని మనం ఉపయోగించొచ్చు. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
#1. అందమైన పెదాల కోసం:
పెదాలపై డెడ్ స్కిన్ ను తొలగించడానికి వాసెలిన్ మనకి ఉపయోగపడుతుంది. అలానే దానిని మనం లిప్ బామ్ కింద కూడా ఉపయోగించవచ్చు. లిప్ స్టిక్ వేసుకునే వాళ్లు మొదట వాసెలిన్ ని పెదాల మీద రాసుకుని తరవాత దాని మీద లిప్ స్టిక్ ని కూడా వేసుకోవచ్చు. అదే విధంగా వాసెలిన్ ని పెదాలకు రాసుకుని కాసేపు అలా వదిలేసి తర్వాత పాత టూత్ పేస్ట్ తో పెదాలని నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవచ్చు. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే మృదువైన పెదాలు మీ సొంతమవుతాయి.
#2. గోళ్ళకి ఉపయోగపడుతుంది:
అలానే గోళ్ళకి మనం నెయిల్ పాలిష్ వేయడం వల్ల వాటి మచ్చలు ఉండిపోతాయి. దానిని తొలగించడానికి వాసెలిన్ ఉపయోగపడుతుంది.
#3. చర్మం బాగుంటుంది:
మోచేతులు, మోకాళ్ళ వద్ద చర్మం నల్లగా మారిపోతుంది. అప్పుడు వాసెలిన్ రాసుకుంటే మృదువైన చర్మం మళ్ళీ తిరిగి పొందొచ్చు.
#4. మేకప్ తొలగించచ్చు:
మేకప్ ని తొలగించడానికి కూడా వాసెలిన్ ఉపయోగపడుతుంది. సన్ బర్న్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది కూడా. ఐ లైనర్, మస్కారా వంటి వాటిని తొలగించడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది.