చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు ఒకటి. అధిక బరువు తో ఎంతో మంది సతమతం అవుతూ ఉంటారు. అయితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించాలంటే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారా..?, బరువు తగ్గాలని, కొవ్వును కరిగించుకోవాలి అని అనుకుంటున్నారా…? అయితే మీకోసం ఈ ఆరోగ్యకరమైన పద్దతి.
దీనిని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా ఎంతటి కొవ్వునైనా కరిగించుకోవచ్చు. ఉల్లిపాయ కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగించడానికి ఉల్లిపాయని ఉపయోగించొచ్చు.

దీనికోసం మీరు ఉల్లిపాయ నుండి రసం తీసుకుని రెండు స్పూన్ల ఉల్లిపాయ రసం లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనెని గోరు వెచ్చని నీటిలో వేసి ఉదయాన్నే తీసుకోవాలి. వారానికి మూడు సార్లు ఈ విధంగా ఫాలో అయితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. అలానే ఈ మిశ్రమాన్ని పరగడుపున తీసుకుంటే గ్యాస్ సమస్య ఉండదు. అలానే దీనిని తీసుకోవడం వలన బరువు కూడా తగ్గవచ్చు. చెడు కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు.
