బొట్టు పెట్టుకోవడం అనేది భారతదేశ సంప్రదాయపు విశిష్టమైన లక్షణం. పురాతన కాలం నుండి మహిళలు నుదుటన బొట్టును పెట్టుకుంటున్నారు. అమ్మమ్మలు, నాయనమ్మలు అయితే కుంకుమతో పెద్దగా బొట్టు ధరించి, నిండుగా కనిపించేవారు. కాలంతో పాటుగా పెట్టుకునే బొట్టు సైజ్ కూడా మారిపోయింది.
కుంకుమ స్థానంలో స్టిక్కర్స్ వచ్చాయి. బొట్టు పెట్టుకున్నట్లయితే ముఖం వెలిగిపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అందంగా కనిపించడం కోసం కానీ, సంప్రదాయం కోసం కానీ బొట్టును పెట్టుకుంటారని భావిస్తారు. మహిళలు బొట్టు పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణురాలు డా. దీక్షా భావసర్ వెల్లడించారు.
యోగా ప్రకారంగా, స్త్రీలు బొట్టు పెట్టుకునే స్థలాన్ని అజ్ఞా చక్రం అని అంటారు. ఈ చక్రాన్ని మనిషి శరీరంలో 6వ, మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. బొట్టు పెట్టుకునే సమయంలో ఈ పాయింట్‌ను రోజుకు అనేక సార్లు ప్రెస్ చేస్తుంటారు. శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి. ఈ నాడులన్నిటికి కేంద్ర స్థానమే ఈ అజ్ఞా చక్రం. ఈ స్థానంలో కళ్లు, తల, పిట్యూటరీ గ్రంధి, మెదడుకి సంబంధించిన నాడులు ఉంటాయి.
మహిళలు బొట్టు పెట్టుకునేప్పుడు లేదా స్టిక్కర్ పెట్టుకునే సమయంలో ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆజ్ఞా చక్రం పై ఒత్తిడి పడుతుంది. అప్పుడు నాడులు అన్నీ ఉత్తేజం అవుతాయి. ఇక పురుషులు బొట్టు పెట్టుకోరు. అందువల్ల వారు ఆ స్థానంలో కుంకుమను ధరించినా, లేదా వంద సార్లు ఆ స్థానాన్ని ప్రెస్ చేసినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ దీక్షా తెలిపారు. ఆ ప్రయోజనాలు ఏమిటంటే..
1. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
2.సైనస్‌లను క్లియర్ చేస్తుంది.
3. దృష్టి మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
5. డిప్రెషన్‌ను నివారిస్తుంది.
6. వినికిడిని మెరుగుపరుస్తుంది.
8. జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది.
9. అంతర్ దృష్టి మరియు అవగాహనను మెరుగుపరుస్తుంది.
10. ఒత్తిడితో కూడిన మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.
https://www.instagram.com/reel/CrNP-a_IYM7/?utm_source=ig_embed&ig_rid=ffac44c6-6c26-4686-bd72-8614fc32df25
Also Read: మీ నాలుక రంగుని బట్టి మీకున్న అనారోగ్య సమస్యని గుర్తించచ్చు…ఎలాగో తెలుసా.?



ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెలోని రక్త నాళాలలో రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడటం లేదా రక్తనాళాలు పూడుకుపోవడం తదితర కారణాలతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ ముఖర్జీ మరియు డాక్టర్ మువ్వా శ్రీనివాస్ ఒక వీడియోలో మాట్లాడుతూ తమ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒకరు చెప్పిన విషయన్ని పంచుకుంటూ, అదే సమయంలో గుడికి వెళ్ళినపుడు గుండెపోటు వచ్చినపుడు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ద్వారకా తిరుపతికి వెళ్ళిన ఒక మహిళ ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పడిపోయింది.
అప్పుడు ఆమె కుటుంబ సభ్యులకు సీపీఆర్ చేయడం పై కొంత అవగాహన ఉండడంతో ఆమెకు సీపీఆర్ చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారని డాక్టర్ ముఖర్జీ తెలిపారు. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెల్లడించారు. ఈ విషయం గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే క్రింద ఉన్న వీడియోని చూడండి..












పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు.ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి.



