తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరోకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే బాలయ్య బాబుకు కూడా మంచి క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు కానీ ప్రతి హీరో అభిమానులు కచ్చితంగా బాలయ్యను కూడా అభిమానిస్తారు.
బాలయ్య బాబుకి తన సినిమాలకే కాకుండా తన మాటలకి, తన బిహేవియర్ కి కూడా ఫాన్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బాలయ్య బాబు సినిమాలు అంటే అక్కడ జరిగే రచ్చ అంతా ఇంతా కాదు.

తనకు నచ్చిన విషయాల గురించి గొంతెత్తి మాట్లాడుతాడు, అలాగే ఏదైనా నచ్చితే మెట్టు దిగిన అయినా అభినందిస్తాడు బాలయ్య. అలాగే ఈమధ్య బాలయ్య చేసిన ఒక పనికి అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తూ ఉన్నాడు. అయితే ఒక వీరాభిమాని బాలయ్య కార్యాలయానికి వెళ్ళాడు. మామూలుగా ఏ హీరో అయినా అంతలా పట్టించుకోరు కానీ బాలయ్య మాత్రం ఆ వ్యక్తిని లోపలికి పిలిచి మాట్లాడాడు.

ఆ వ్యక్తి వికలాంగుడు కావడంతో తను కాళ్ళ మీద నిలబడి మాట్లాడలేకపోయాడు. కనుక బాలయ్య తనతో మాట్లాడడానికి అని మోకాల మీద కూర్చొని ఆప్యాయంగా మాట్లాడాడు. ఏ హీరో అయినా ఇలా చేస్తారా మన బాలయ్య బాబు తప్ప? అంటూ అభిమానులు బాలయ్య బాబుని పొగుడుతూ సోషల్ మీడియాలో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. మా బాలయ్య బాబు కనుకే ఇలా చేశారు.

మరే హీరో అయినా ఇంత మెట్టు దిగి మరి ఒక అభిమానితో మాట్లాడడు. బాలయ్య బాబు బయటకి అంత కోపంగా ఉన్నా సరే అతని మనసు వెన్నెముక లాంటిది. ప్రతి ఒక్కరికి అభిమానాన్ని పంచుతారు. అందుకే మేము బాలయ్యకు అభిమానులం అయ్యాము. జై బాలయ్య.. జై జై బాలయ్య.. అంటూ నినాదాలతో ట్రెండ్లు చేస్తూ బాలయ్య అభిమానులు బాలయ్యను పొగుడుతూ సోషల్ మీడియా అంతా రచ్చ చేస్తున్నారు.

























కోరాలో “ఈ కాలంలో (కలికాలం) పెళ్లి కూతుర్లు సిగ్గు పడడం మానేసి పెళ్ళిలో ఐటం సాంగ్ లకు డాన్స్ లు చేయడాన్ని మీరు సమర్థిస్తారా విమర్శిస్తారా? ఎందుకు? అనే ప్రశ్నకు
ఒకప్పుడు పసుపు కొట్టే పండుగ అనేది, మన దగ్గర చాలా గుంభనంగా జరిగేది. మరీ ముఖ్యమైన బంధువులు మాత్రమే, అలా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి కొడుకు/ పెళ్లి కూతురు పొట్ట పై రోకలి తో చిన్నగా కొట్టేవారు. పసుపు తీసి, మంగళ స్నానాలు చేయించేవారు.. ఇప్పుడు మాత్రం మనవాళ్ళు ఉత్తరాది వారి హల్దీ ఎరువు తెచ్చుకుని,ఒకరి మీద ఒకరు పసుపు జల్లుకుంటూ, రెయిన్ డ్యాన్స్ లు. సంప్రదాయం కన్నా, రీల్స్ కి , సెల్ఫీ లకే ఇప్పుడు ప్రధానం. ఇది ట్రెండ్ అనుకుని పెద్దగా మనసుకి తీసుకుకుంటే మంచిది.
కానీ ఈ కృత్రిమత్వమే సహజం అనుకునే స్థాయి వచ్చేసింది ఈ సమాజంలోకి, ముఖ్యంగా జనరేషన్ జెడ్ (2000 తర్వాత జన్మించిన వారు) ఈ సెల్ఫీలకి రీల్స్ కి బాగా అలవాటు పడ్డారు. వారిని చూసి, వారిలా చేయకపోతే మనల్ని ఎక్కడ ముసలివాళ్ళు అనుకుంటారో అనో, బాగుందనో అంతకు ముందు తరాల వారు కూడా ఈ ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటో షూట్,ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇలా ఏవి తీసుకోండి, బాగుపడేది లక్షల్లో ప్యాకేజీలు అందుకునేది కేవలం ఫొటోగ్రాఫర్లు మాత్రమే.
అందుకోసం వారు చెప్పిన పిచ్చి చేష్టలు, వెకిలి వేషాలు, గోడ అంచున నిలబడి సాహసాలు, అబ్బో కృత్రిమత్వానికి పరాకాష్ట. ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి , ఇన్ని సాహసాలు చేసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు పోనీ సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటారా అంటే, ఎబ్బే. ఇక మీరు అమ్మాయిలకి సిగ్గు లేదా అని అడిగారు, అది తప్పు. అబ్బాయిలు కూడా అదే బారాత్ అనే కార్యక్రమంలో డాన్స్ లు చేస్తున్నారు కదా, వీరికి సిగ్గు లేదంటే, వారికీ లేనట్టే కదా. వారి పెళ్ళిలో వారు డ్యాన్స్ చేస్తారో, ఫైట్ చేస్తారో వారి ఇష్టం అని వదిలేయడం ఉత్తమం. కాబట్టి జడ్జ్ చేయడం మానేయండి.
మీకు వీలైతే అలంటి ఫంక్షన్స్ కి దూరంగా ఉండడం, ఆ తరహా నృత్యాలు ఉన్న వీడియోస్ చూడడం మానేయండి. ఎవరికీ నచ్చిన పని వారు చేసుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది అన్న సంగతి మరువకూడదు. అలాగే అలంటి కార్యక్రమాలకి దూరంగా ఉండే హక్కు కూడా అందరికీ ఉంది. అది గుర్తించుకుంటే మనశ్శాంతికి లోటుండదు. సర్వేజనా సుఖినోభవంతు” అంటూ దుర్గా ప్రసాద్ తూము రాసుకొచ్చారు.




