నిజమైన ప్రేమ అంటే ఇదే… వీళ్ళ మీద ఏకంగా సినిమానే తీశారు..! వీరి గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

నిజమైన ప్రేమ అంటే ఇదే… వీళ్ళ మీద ఏకంగా సినిమానే తీశారు..! వీరి గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by Mounika Singaluri

Ads

చాలామంది నిజ జీవితాలు ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. చాలా సినిమాలు అలా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా 12th ఫెయిల్ అనే సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది.

Video Advertisement

12th ఫెయిల్ అయిన ఒక అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమా కథ. అయితే ఇది ఒక వ్యక్తి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆ వ్యక్తి ఎవరు అతని కథ ఏంటో ఒకసారి చూద్దాం…!

movie made on this couple

మనోజ్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ నిజ జీవితం ఆధారంగా అనురాగ్ పాఠక్12th ఫెయిల్ అనే పుస్తకాన్ని రాశాడు. విను వినోద్ చోప్రా ఈ పుస్తకం ఆధారంగా 12th ఫెయిల్ సినిమాని రూపొందించాడు. ఇది యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలనుకున్న ఎందరో మంది ఆస్పిరెంట్స్ జీవితాలను ఆధారంగా చేసుకుని తీసిన మూవీ. ఈ క్రమంలో వారు పడ్డ కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.

movie made on this couple

మహారాష్ట్ర క్యాడర్ కి చెందిన మనోజ్ శర్మ ఎనిమిదో తరగతి వరకు బాగనే చదవాడు… అయితే తొమ్మిది, 10 తరగతిలో పాస్ అవ్వడానికి బాగా కష్టపడ్డాడు. తర్వాత 12th ఫెయిల్ అవ్వడం, ఆ సబ్జెక్టులు క్లియర్ చేసి డిగ్రీ పూర్తి చేసి యుపిఎస్సి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. 4వ అటెంప్ట్ లో ఎగ్జామ్స్ క్లియర్ చేశాడు. అయితే యుపిఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే సమయంలో మనోజ్ శర్మ ఎన్నో కష్టాలు పడ్డాడు. టెంపో డ్రైవర్ గా పనిచేశాడు, రోడ్లమీద పడుకున్నాడు, తన యూపీఎస్సీ ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు డాగ్ వాకర్ గా కూడా పనిచేశాడు.

movie made on this couple

ఈ సమయంలోనే శ్రద్ధా జోషిని కలుసుకున్నాడు. కష్ట సమయంలో మనోజ్ కి శ్రద్ధ ఎంతగానో సపోర్ట్ చేసింది. తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ లవ్ స్టోరీ గురించి చూస్తే… ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే సమయంలో ఉత్తరాఖండ్ చెందిన శ్రద్ధా జ్యోషితో పరిచయం ఏర్పరచుకున్నాడు. తక్కువ సమయంలోనే శ్రద్ధాకి బాగా దగ్గరై తన మీద ప్రేమ పెంచుకుని అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు.

movie made on this couple

అయితే ఆ ప్రపోజల్ శ్రద్ధ పట్టించుకోకుండా నీకు పిచ్చా అంటూ అడిగింది. అయితే మనోజ్ మాత్రం శ్రద్ధా మీద తన ప్రేమను వ్యక్తపరచడానికి తనకి ఇష్టమైన టీ పెట్టడం నేర్చుకున్నాడు. కోచింగ్ సెంటర్ కి శ్రద్ధా కోసం భోజనాన్ని వండి తీసుకెళ్లేవాడు. శ్రద్ధా మీద మనోజ్ చూపిస్తున్న ఆసక్తిని గమనించిన అతని స్నేహితుడు అనురాగ పాఠక్ మనోజ్ ని వారించాడు. చదువు మీద దృష్టి పెట్టాలని సూచించాడు. ఇదే సమయంలో శ్రద్ధా మనోజ్ కి పూర్తిగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది.

movie made on this couple

తన చదువుకి అవసరమైన నోట్స్ రాయడం, మెటీరియల్స్ అందించడం వంటివి చేసేది. అయితే మనోజ్ 3 యుపిఎస్సి అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాడు. శ్రద్ధా మాత్రం పిసిఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసే డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ పొందింది. నాలుగో అటెంప్ట్ లో మనోజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యాడు. తర్వాత వీరు ఇద్దరు పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 12th ఫెయిల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మనోజ్ జీవితం ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది అంటూ పొగుడుతున్నారు.


End of Article

You may also like