విశాఖపట్నానికి చెందిన ఒక యువకుడు డెలివరీ బాయ్ గా పని చేస్తూ చదువు కొనసాగించాడు. ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి ఉద్యోగం సంపాదించాడు. పనిచేస్తూ చదువుకోవడం అనేది చిన్న విషయమేమీ కాదు. ఏ పని చేయకుండానే చదువుకోడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఈ తరం యువతకు ఇతడు ఒక ఆదర్శం అని చెప్పవచ్చు.
తనకు ఎలా ఏ విధంగా సాధ్యమయిందో అనే విషయాన్ని తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో వివరించాడు. తాను కాలేజీలో చదివే సమయంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండేది కాదు. నాన్న ఒక కాంట్రాక్టు ఉద్యోగి. ఆయన తెచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. నేను నా వంతు సాయం చేద్దామని డెలివరీ ఏజెంట్ గా పనిలో చేరాను.

షేక్ అబ్దుల్ సత్తార్ ఆంధ్రరాష్ట్రం విశాఖనగరంలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేశాడు. తర్వాత శ్రీ గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.
ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి12 గంటల వరకూ వార్తలు డెలివరీ బాయ్ గా పని చేసేవాడిని, దీని ద్వారా నేను సంపాదించిన డబ్బుని ఇంటి అవసరాలకు మరియు నా చదువు నిమిత్తం ఉపయోగించే వాడిని అని తన లింక్డ్ఇన్ పోస్ట్ లో వివరించాడు.
ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉంచాల్సిన స్థాయి నుండి నా తల్లిదండ్రుల అప్పులు తీర్చగలిగే స్థాయికి ఎదిగాను. నా జీవితాన్ని ఇంత శక్తివంతంగా మార్చినందుకు NxtWave కి కృతజ్ఞుడను అని తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వివరించాడు.
source: linkedin


















మరీ ముఖ్యంగా చాలా మంది భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమై కనీసం భర్తతో గడపడానికి సమయం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్యకు కనీసం భర్త కొంత సమయం కూడా ఇవ్వకుండా నెగ్లెట్ చేస్తున్నారు. ఇలా ఉంటే మరి ఇక జీవితంలో రాబోయే సమస్యలు ఏమిటో ఓసారి చూద్దాం..? భార్యకు భర్త అనే వాడు సమయాన్ని కేటాయించక పోతే అక్రమ సంబంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
భర్తలు ఎప్పుడూ పని పని అంటూ వారికి కావలసిన సమయంలో ఇంటికి వచ్చి, హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అదే భార్యకు కావాల్సిన సమయంలో దగ్గర ఉండకపోవడం, ఈ విధంగా భార్య తన భర్త గురించి ఆలోచిస్తూ ఉండటం, నా భర్త నాతో మాట్లాడటం లేదని, నా ఫోన్ తీయడం లేదని అనేక విషయాలు ఆలోచిస్తూ అసహణంగా మారుతారు. ఆ తర్వాత కోపం పెంచుకుని భర్త బయట ఏం చేస్తున్నాడో,
నేను కూడా ఇలా చేస్తే తప్ప ఆలోచనతో తప్పు కూడా చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మీకు తెలిసి ఈ విషయం అడిగినా మీరు బయట తిరగడం లేదా, మీరు ఏం చేస్తున్నారు అని నేను అడిగానా అని వాగ్వాదానికి దిగి గొడవలు జరిగి విడాకులు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి భర్త అనే వారు కంపల్సరిగా భార్య కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ఆనందంగా గడపాలని నిపుణులు తెలియజేస్తున్నారు.












