పది రూపాయల అప్పుని 12 ఏళ్ల తర్వాత తీర్చారు… అసలేం అయ్యిందంటే..?

పది రూపాయల అప్పుని 12 ఏళ్ల తర్వాత తీర్చారు… అసలేం అయ్యిందంటే..?

by Megha Varna

Ads

చాలామంది అవసరానికి అప్పు తీసుకుంటారు. కానీ తర్వాత మళ్లీ అప్పు తీసుకున్న సంగతి కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి గురించి మాత్రం మనం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే ఏకంగా అమెరికా నుండి వచ్చి మరి అప్పు తీర్చారు. అదేంటి ఏకంగా అమెరికా నుండి వచ్చి అప్పు తీర్చారా..? ఎంత అప్పు చేసారు ఏంటి అని అనుకుంటున్నారా..? ఎంతో కాదండి కేవలం పది రూపాయలు. మరి ఇక దీని గురించి ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

Video Advertisement

ఇర్షి వీడియోల కధనం ప్రకారం నేమాని మోహన్ గారిది కాకినాడ. అమెరికాలో ఆయన స్థిరపడ్డారు. అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు కాకినాడ వచ్చి వెళ్తూ ఉంటారు. 2010లో ఒకసారి మోహన్ గారు కుటుంబంతో పాటు కాకినాడ వచ్చారు. సరదాగా కుటుంబమంతా కలిసి కాకినాడ బీచ్ కి వెళ్లారు. అక్కడ సైకిల్ మీద పల్లీలు చూసి మోహన్ గారి అబ్బాయి ప్రణవ్ కొనమని అడిగాడు. గింజల పెద్ద సత్తయ్య గారు సైకిల్ మీద పల్లీలు అమ్ముతున్నారు. అతని దగ్గరికి వెళ్ళి పల్లీలు ఇప్పించారు.

పల్లీలు తీసుకున్నారు కానీ డబ్బులు చూస్తే లేవు. పర్సు కూడా ఇంట్లో మర్చిపోయినట్టున్నారు. డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాలేదు. పరవాలేదు అని పెద్ద మనసుతో.. మీ పిల్లలు అయితే ఒకటి మా పిల్లలు అయితే ఒకటా అని డబ్బులు తీసుకోకుండా పల్లీలను ఇచ్చేసి వెళ్ళిపోయారు. మోహన్ వాళ్ళ అబ్బాయి ప్రణవ్ పల్లీలు అమ్ముతున్న సత్తయ్య గారికి ఒక ఫోటో తీశాడు. తన దగ్గరే ఆ ఫోటోని ఉంచుకున్నాడు. అయితే పది రూపాయలు పల్లీలు అమ్మిన ఆయనకి ఇవ్వాలి అని ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా సరే చూస్తూ ఉండేవారు.

చాలాసార్లు అమెరికా నుంచి కాకినాడ రావడం.. చూడడం.. దొరకక వెళ్ళిపోవడం జరుగుతోంది. ఇంక ఈసారి మోహన్ గారి ఫ్రెండ్ అయిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సహాయం తీసుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఫేస్ బుక్ ద్వారా ఒక పోస్ట్ ని కూడా షేర్ చేసారు. ఆ పల్లీలు అమ్మే ఆయన ఎంతో సహాయపడ్డారని..వివరాలు తెలిస్తే చెప్పమని అందులో వుంది. అడ్రస్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు. తీరా చూస్తే ఆయన రెండేళ్ల క్రితం చనిపోయారు అని అతని సతీమణి  గంగవ్వ చెప్పింది. ఆమెను కలిసి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు.

మా ఆయన సత్తయ్య గారు కాకినాడ బీచ్ దగ్గర పల్లీలు అమ్మి ఎంతో కష్టపడి మమ్మల్ని పోషించేవారు అని ఆమె చెప్పారు. అయితే రెండేళ్ల క్రితం ఆయన చనిపోయారు. మా ఆయన మంచితనానికి మోహన్ గారు 12 ఏళ్ల తర్వాత మమ్మల్ని వెతకడం.. ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎప్పుడో 12 ఎలా క్రితం మేము 10 రూపాయలు తీసుకున్నది మా అబ్బాయి ఎప్పుడు గుర్తు చేస్తాడని.. ఫోటో కూడా తీసాడని.. దానివల్ల మేము డబ్బులు తిరిగి ఇవ్వగలిగాము అని మోహన్ గారు చెప్పారు.

 

 

 


End of Article

You may also like