దేశంలో యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇచ్చిన సలహా పై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన కొనసాగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఐటీ ఉద్యోగులు నారాయణమూర్తిని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తన భర్త చేసిన వ్యాఖ్యలపై సుధా మూర్తి స్పందించారు.
నా భర్త అయితే స్వయంగా వారానికి 80 నుండి 90 గంటలు పని చేశారని నిజమైన హార్డ్ వర్క్ పై ఆయనకు నమ్మకం ఉందని చెప్పారు.” ఆయన వారానికి 80 నుండి 90 గంటలు పని చేశారు ఆయనకు అదే తెలుసు, నిజమైన కష్టాన్ని నమ్మి ఆయన అలాగే జీవించారు అందుకే ఆయనకు అనిపించింది చెప్పారని” సుధా మూర్తి తెలియజేశారు.ఇన్ఫోసిస్ అనేది దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ. దాని వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.
సుధా మూర్తి నారాయణ మూర్తిల సక్సెస్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. సుధా మూర్తి ఒక మంచి మోటివేషనల్ స్పీకర్. అయితే ఇన్ఫోసిస్ ఈరోజు ఐటీ రంగంలో ముందంజలో ఉండడానికి నారాయణ మూర్తి ఎంత కష్టపడ్డా దాని వెనకాల సుధా మూర్తి కృషి కూడా ఉంది.అయితే ఈ రోజుల్లో కార్పొరేట్ ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నారాయణమూర్తికి చెప్పడానికి ప్రయత్నించార అని అడిగినప్పుడు ఆమె సమాధానం చెబుతూ “యువత విభిన్న భావాలను కలిగి ఉంటారని, అయితే స్వయంగా ఎక్కువ గంటలు పనిచేసిన నారాయణమూర్తి తన అనుభవాన్ని పంచుకున్నారని వివరించారు”.
భారతీయ యువత ఉత్పాదకతపై నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసాయి. యువత రోజుకు 12 గంటలు పని చేస్తేనే గత రెండు మూడు దశాబ్దాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మిగతా దేశాలను భారత చేరుకోగలదని నారాయణమూర్తి ఇటీవల చెప్పారు. భారతదేశ ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని ఆయన అన్నారు.
Also Read:అమ్మో ఇంత పెద్ద పేరా…. ఏకంగా 157 అక్షరాలు…! స్కూల్ లో జాయిన్ అయితే ఎలాగో.?