రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురూష్. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించగా, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు.
ఈ చిత్రం 5 వందల కోట్ల బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి షోతోనే విమర్శలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. సోషల్ మీడియాలో దర్శకుడిని, రచయితను దారుణంగా ట్రోల్ చేశారు.
ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఆడియెన్స్ తో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, వివాదాలు, కోర్టులో కేసులు వేసే వరకు వెళ్ళింది. రామాయణంను మార్చి చూపించారని, రావణాసురుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని, హనుమంతుడితో మాస డైలాగ్స్ చెప్పించారని, పేర్లు మార్చారని ఇలా ఎన్నోవివాదాలు వచ్చాయి.
తాజాగా కోరాలో “ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిపేరు శేషు అని పెట్టారు. దీని గురించి వివరించగలరా?” అనే ప్రశ్నను అడుగగా ఈగల్ కింగ్ అనే యూజర్ ఇలా సమాధానం చెప్పుకొచ్చాడు. “శ్రీ మహా విష్ణువు – శ్రీ రామునిగా అవతారం ఎత్తాడు. అదే విధంగా ఆయన వైకుంఠంలో పడుకునేది పాము మీద పాముని శేషు అని కూడా అంటారు.
ఆ పామే లక్ష్మణునిగా జన్మించింది. అందుకే ఈ సినిమాలో లక్ష్మణుని పూర్వ జన్మ పేరుతో శేషు అని పిలిచాడు రాముడు. ఇంకా మహావిష్ణువు యొక్క శంకు, చక్రాలు – భరత, శతృఘ్నులుగా, ఆయన సతీదేవి అయినటువంటి మహాలక్ష్మి దేవి సీతగా జన్మించారు” అని తెలిపారు.

































అలాంటి వాటిల్లో ఒక నమ్మకం.. మూడు రోటీలను ఒకే ప్లేట్లో కలిపి వడ్డించకూడదు. ఈ సంప్రదాయాన్ని చాలా మంది ఏళ్ల తరబడి పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక కారణం చాలా మందికి తెలియదు. ఒక ప్లేట్లో 3 రొట్టెలను ఎప్పుడూ పెట్టవద్దు – జ్యోతిషశాస్త్రంలో మూడవ సంఖ్య మంచిది కాదు. మూడవ సంఖ్య ఆరాధన లేదా సాధారణ జీవితానికి దూరంగా ఉంచుతుందని నమ్ముతారు.
ఈ ఏడాది అధిక శ్రావణమాసం జులై 18 నుండి ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఇక నిజ శ్రావణం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. ఇక అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసంలో ముహూర్తాలు పెట్టి చేసే శుభకార్యాలు కొత్త షాపులను ప్రారంభించడం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, పెళ్ళిళ్ళు, ఉపనయనం, సీమాంతం, వాస్తు పూజల వంటివి చేయకూడదని అంటారు.
ఇక ఈ నెలలో చేయాల్సిన వాటిని తప్పనిసరిగా చేయాలి. అవి ఏమిటంటే పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు. ఆబ్దికం వంటి వాటిని మానకుండా బ్రహ్మణుడికి సమర్పించాల్సినవి చేయాలి. నిజ శ్రావణ మాసంలో సరి అయిన రీతిలో ఆబ్దికంను జరిపించాలి. అధిక మాసం కాబట్టి ఈ నెలలో ఏం చేసిన అధిక ఫలితాన్ని పొందుతారు.
కాబట్టి జపాలు, తపాలు, నిత్యం చేసే పూజలు అధికంగా చేయడం. పారాయణం, తీర్థయాత్రలు, నది స్నానాలు, సముద్ర స్నానాలు వంటి పుణ్యకార్యాలను తప్పనిసరిగా చేసినట్లయితే మామూలు రోజుల కన్నా అధికమైన ఫలితం ఉంటుందని చెబుతారు.నిత్య పూజలు చేసేవారు మానకుండా అధిక మాసంలో కూడా కొనసాగించాలి. వరలక్ష్మి వ్రతం ను తప్పని సరిగా అధికమాసంలో చేసుకోవాలని లేదు. నిజ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.