పుట్టుమచ్చల ఆధారంగా స్త్రీ జీవితం పెళ్లయ్యాక ఎలా ఉంటుందో చెప్పచ్చు అంట.? ఎలాగంటే.?

పుట్టుమచ్చల ఆధారంగా స్త్రీ జీవితం పెళ్లయ్యాక ఎలా ఉంటుందో చెప్పచ్చు అంట.? ఎలాగంటే.?

by Megha Varna

Ads

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకు వస్తుంది. పెళ్లి తో రెండు మనసులు దగ్గర అవుతాయి. రెండు కుటుంబాలు ఒకటవుతాయి. పురుషులకైనా, స్త్రీలకైనా పెళ్లి పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తనకి కాబోయే వాళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

పైగా జీవిత భాగస్వామితో అంతా కలిసి రావాలని.. అదృష్టం రావాలని అనుకుంటారు. అయితే వివాహం తర్వాత స్త్రీకి అదృష్టాన్ని తెచ్చే పుట్టుమచ్చలు కొన్ని ఉన్నాయి. అయితే మరి పుట్టుమచ్చల గురించి, వాటి వలన ఎలాంటి ప్రభావం కలుగుతుంది అనే దాని గురించి చూద్దాం.

కాలిమీద పుట్టుమచ్చ:

కాలిమీద పుట్టుమచ్చ ఉంది అంటే వాళ్లు చాలా తెలివైనవారు అని అర్థం. ఆమె కనుక మీ జీవితంలోకి వచ్చింది అంటే మీకు అదృష్టం వచ్చినట్లే. దీంతో మీ జీవితం మరింత మెరుగు పడుతుంది. కాబట్టి కాలు మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకోవడం మంచిది.

బొటన వేలుపై పుట్టుమచ్చ:

ఒకవేళ కనుక అమ్మాయి బొటన వేలు పై పుట్టుమచ్చ ఉంది అంటే ఆమె జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. బొటన వేలు దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే ఆమె జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి.

నుదుటి మధ్యలో పుట్టుమచ్చ:

నుదిటి మధ్యలో పుట్టుమచ్చ ఉంది అంటే ధనవంతుడుని వివాహం చేసుకుంటుంది. ఆమె పెళ్లి తర్వాత డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. అలానే జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది.

చేతి పై పుట్టుమచ్చ:

స్త్రీ చేతి పై కనుక పుట్టుమచ్చ ఉంది అంటే భర్త ఎంతో బాగా చూసుకుంటారు. వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

కంటి కింద పుట్టుమచ్చ:

కంటి కింద పుట్టుమచ్చ ఉన్న స్త్రీ కనుక భార్యగా వచ్చిందంటే అదృష్టమే. పైగా ఆమె కూడా పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు.

నాభి వద్ద పుట్టుమచ్చ:

ఇక్కడ పుట్టుమచ్చ ఉంది అంటే స్త్రీ వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతుందని.. భర్త అదృష్టవంతుడు అని అంటారు.

పాదాల కింద పుట్టుమచ్చ:

పాదాల కింద పుట్టుమచ్చ ఉంది అంటే జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అర్థం. పైగా జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది ఆమె.

ఇవి కూడా చదవండి: “నా భర్త ఇలా అన్ని చెప్పేయడం నచ్చట్లేదు.. చివరకు ఆ విషయాలు కూడా..? నా సమస్యకి పరిష్కారం ఏంటి..?


End of Article

You may also like