మనం నిద్రపోయేటప్పుడు కలలో చాలా కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు మంచికి సంకేతంగా కలలు వస్తే మరికొన్ని సార్లు చెడుకి సంకేతంగా కూడా కల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా వచ్చిన కలలని తలుచుకుని బాధ పడడం మంచిది కాదు. అయితే కొన్ని వస్తువులు మాత్రం కలలో కనపడితే చాలా మంచి కలుగుతుంది. అలానే చేదు మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే మరి కలలో ఏ వస్తువులు కనబడితే శుభం కలుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం.
#1. ధాన్యం:
కలలో కనుక మనకి ధాన్యం కనబడింది అంటే ఇక అదృష్టం వచ్చినట్లే. మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఓటమి లేకుండా మీరు గెలుస్తారు.అదే విధంగా ఎంతో మంచి మీకు కలుగుతుంది.
#2. పసుపు కుంకుమ:
పసుపు కుంకుమ కనుక మీ కలలో కనపడ్డాయి అంటే కలకాలం మీరు ఆనందంగా ఉంటారు అని అర్థం. అలానే సిరిసంపదలకు ఎటువంటి లోటు లేదు అని దానికి అర్థం. విజయం కూడా తద్యం. కాబట్టి పసుపు కుంకుమ కలలో కనపడ్డాయి అంటే కూడా మీకు తిరుగు ఉండదు.
#3. తేనే:
కలలో తేనె లేదా పాలు కనబడితే కూడా శుభానికి సంకేతం. మీరు చేసే పనిలో తప్పక విజయం కలుగుతుంది అని దానికి అర్థం. కాబట్టి ఇవి కనుక ఇవి కనబడ్డాయంటే ఇక మీ వెంట అదృష్టం వున్నట్టే.