పొరపాటున అయినా ఈ 4 తప్పులు చేస్తే మీ వద్ద డబ్బు అస్సలు నిలవదు.. అవేంటో ఓ సారి చూడండి..!

పొరపాటున అయినా ఈ 4 తప్పులు చేస్తే మీ వద్ద డబ్బు అస్సలు నిలవదు.. అవేంటో ఓ సారి చూడండి..!

by Anudeep

Ads

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.

Video Advertisement

ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.

chanakya 3

ఆచార్య చాణిక్య మానవుల ప్రవర్తన గురించి ఈ గ్రంథంలో వివరించారు. ముఖ్యంగా మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. మానవుల మనుగడకు డబ్బు అవసరమైనదే. అయితే ఈ డబ్బు ఎక్కువైనా, తక్కువైనా చేటు తెస్తూ ఉంటుంది. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా మెలగాలని చాణక్య వివరించారు. అయితే ఈ నాలుగు తప్పులు చేసే వారి వద్ద డబ్బు నిలవదని చాణక్య చెప్పారు. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.

chanakya

#శుభ్రత: డబ్బు నిలవాలంటే శుభ్రత చాలా ముఖ్యం. మీ ఇంటికి లక్ష్మి దేవి రావాలని కోరుకుంటే.. మీరు కచ్చితంగా శుభ్రతని పాటించాలి. మీ ఇంటి పరిసరాలు శుభ్రం గా ఉండేలా చూసుకోవాలి.

# మీరు సంపాదించుకున్న డబ్బుని దుర్వినియోగం చేయవద్దు. మంచి కార్యక్రమాల కోసం వినియోగించాలి. మీ డబ్బుని దుర్వినియోగం చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. దారిద్య్రం దాపురిస్తుంది. కాబట్టి సత్కార్యాలు చేయడానికే ప్రయత్నించండి.

money

# అలాగే సక్రమమైన మార్గంలోనే డబ్బుని సంపాదించండి. మోసాలు, తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు మీ వద్ద ఎప్పటికీ నిలవదు. ఆ సంపద ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా ఆ సంపద వల్ల బాధపడే అవకాశం ఉంటుంది.

# మీ వద్ద ఎక్కువ డబ్బు ఉన్నా సరే.. దానిని అనవసరంగా ఖర్చు చేయవద్దు. డబ్బుని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా పొదుపు చేసిన డబ్బే తరువాత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాయం అవుతుంది.


End of Article

You may also like