ఓ మనిషి చనిపోయిన తరువాత అతని అంత్యక్రియలు చేసే సమయం లో శవం తల వద్ద దీపాన్ని పెట్టి ఉంచుతారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? దీనికి ఓ వివరణ ఉంది. మనం చీకటి లో ఉన్నపుడు సరైన మార్గం లో గమ్యం చేరుకోవడానికి దీపం ఎలా సహకరిస్తుందో.. అలానే… చనిపోయిన వ్యక్తి తాలూకు ఆత్మకు కూడా మోక్షానికి చేరడానికి దీపం దారి చూపిస్తుంది. ఎవరు చనిపోయిన, వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుంచి బయటకు వస్తే వారికి తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది.
అలా రావాలనే అందరు కోరుకుంటారు. తల దగ్గర దీపం ఉంచడం ద్వారా ఆ వెలుగు వైపుకు మరణించిన వ్యక్తి తాలూకు ఆత్మ ప్రయాణిస్తుంది. ఆత్మకు కూడా పైలోకానికి చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఉత్తర మార్గం, రెండు దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగు తో నిండిఉంటుంది. దక్షిణ మార్గం లో చీకటి ఉంటుంది. ఆత్మ వెలుగు ద్వారా ప్రయాణించడం కోసమే శరీర ఉత్తర భాగం వైపు దీపాన్ని ఉంచుతారు. హిందూ సంప్రదాయం లో ఈ ఆచారం తరతరాలు గా వస్తోంది.