ప్రతి ఒక్కరి జీవితం లో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం. జీవితాంతం మనతో కలిసి ఉండే తోడు కోసం.. మనకు నచ్చిన వ్యక్తిని, మనలను అర్ధం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మనం కలలు కంటుంటాం. అప్పటి దాకా ఒంటరిగా ఉన్న మనం.. మరొకరిని పెళ్లి చేసుకున్న తరువాత కలిసి ప్రయాణిస్తాం. అందుకే జీవిత భాగస్వామి ఎంపిక విషయం లో మనం జాగ్రత్త ఆచితూచి వ్యవహరిస్తాం.

wedding

ఈకాలం యువత కూడా తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఒక్కప్పుడు పెద్దలకు భయపడి అరేంజ్డ్ మ్యారేజ్ లను చేసుకున్నా, ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ లకే మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఈ రెండిటి లో ఏది సరైనది అన్న విశ్లేషణ పక్కన పెడితే, ఓ వ్యక్తి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా..? లేక లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అన్న సంగతి చేతిలో రేఖల్ని బట్టి చెప్పేయొచ్చట. అదెలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

wedding lines 2

పైన ఫోటో లో చూపించినట్లు, మీ చేతులపై ప్లస్ గుర్తులతో గీతలు ఉంటె మీరు కచ్చితం గా ప్రేమ వివాహం చేసుకుంటారు. ఓ సారి మీ కుడి అరచేతిని పరిశీలించండి. పై రేఖకు ఎగువన ఒక చిన్న రేఖ ఉందొ లేదో చూడండి. అలాగే కుడి చేతి చూపుడు వేలుకు ఇంటూ మార్క్, కుడి అరచేతి బొటన వేలుకు దిగువన ఓ బాక్స్ షేప్ లాంటి గీతలు, మూడో అడ్డగీతను, రెండవ అడ్డగీతను కలుపుతూ మరో చిన్న గీత.. ఈ గీతలు మీ చేతి పై ఉన్నాయో లేవో చూసుకోండి. అలా ఉంటె.. మీరు కచ్చితం గా ప్రేమ వివాహాన్ని చేసుకుంటారు.

wedding lines 3

అలానే మీ అరచేతిని బారుగా పెట్టి ఒక సైడ్ కి తిప్పండి. చిటికెన వేలు చివరన లైన్స్ కనిపించాయా? ఈ లైన్స్ పెద్ద గా ఉంటె.. వారు కచ్చితం గా అరేంజ్డ్ మ్యారేజ్ ని చేసుకుంటారు. ఇందాక, పైన చెప్పిన ఆనవాళ్లు ఏమి కనిపించకపోయినా.. వారు పెద్దలు చెప్పిన వివాహమే చేసుకుంటారు. అలాగే, మీ రెండు అరచేతులను దగ్గర గా పెట్టి చూసుకుంటే.. మీ అర చేతుల మధ్య అర్ధ చంద్రాకారం వస్తే.. మీ భార్య మిమల్ని బాగా అర్ధం చేసుకుంటుందని అర్ధం. అలాగే, మీరు ఇద్దరు యిట్టె కలిసిపోతారని అర్ధం. అదే అలా కలిపినపుడు కుడి చేతి వైపు గీత పెద్ద గా ఉంటె మీకంటే ఎక్కువ వయసు ఉన్న భార్య దొరుకుతుందని అర్ధం. అదే, ఎడమ చేతి వైపు గీత పెద్ద గా ఉంటె చదువుకున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారట. అందమైన అమ్మాయి భార్య గా వస్తుందట.