చాణక్య నీతి ప్రకారం ఈ 6 మంది దగ్గర ఎప్పటికి డబ్బు నిలవదు అంట.! తప్పక తెలుసుకోండి.!

చాణక్య నీతి ప్రకారం ఈ 6 మంది దగ్గర ఎప్పటికి డబ్బు నిలవదు అంట.! తప్పక తెలుసుకోండి.!

by Anudeep

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.

Video Advertisement

chanukyudu

ప్రతి అంశం లోను, ప్రతి రంగం లోను మానవుడు ఎలాంటి తెలివితేటలను వినియోగించాలి చాణుక్యుడు సవివరం గా తెలియచెప్పాడు. అలాగే, ఆయన చెప్పిన నీతి సూత్రాలలో… ఏ విధమైన వ్యక్తుల వద్ద భాగ్యలక్ష్మి నివాసం ఉంటుందో..ఈరోజు మనం తెలుసుకుందాం.

chanakya about lakshmi

#1. అతిగా తినే వ్యక్తుల వద్ద కూడా లక్ష్మి నిలవదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే కాకుండా పదే పదే తింటూ కాలయాపన చేసే వారి వద్ద డబ్బు ఆదా అవ్వదు. వారి తిండి కోసమే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆకలి తీర్చుకోవడం కోసం ఆహరం భుజించాలి.. అంతే కానీ తినడం కోసమే బతకకూడదు.

#2. చట్టానికి విరుద్ధం గా వ్యవహరించే వ్యక్తుల వద్ద కూడా ధనం నిలవదు. ఆ క్షణానికి వారు డబ్బు సంపాదించుకున్నప్పటికీ.. అది ఏదో ఒక రూపం లో ఖర్చు అయిపోతూనే ఉంటుంది తప్ప ఆదా అవ్వదు.

 

#3. రాత్రి అనేది నిద్రించడానికి అనువైన సమయం. ఎవరైతే రాత్రి కాకుండా పగలు.. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో నిద్రిస్తారో వారి ఇంట భాగ్య లక్ష్మి నిలవదు. అటువంటి వారికి ఆమె ఎలాంటి సహాయం చేయదు.

#4. దంతాలను కూడా నిరంతరం శుభ్రం గా ఉంచుకోవాలి. రోజు ఉదయం నిద్ర లేవగానే దంత ధావనం పూర్తి చేసుకోవాలి. అలా లేకుండా.. మురికి గా ఉన్న వారి ఇంట ఉండడానికి లక్ష్మి దేవి ఇష్టపడదట.

 

#5. ముఖం పై ఎప్పుడు చిరునవ్వుని ఉంచుకోవాలి. ఎప్పుడు కఠినం గా వ్యవహరించే వ్యక్తులు, గంభీరం గా ఉండే వ్యక్తుల వద్ద లక్ష్మి నిలవదు. ప్రియమైన మాటలు మాట్లాడుతూ..మంచి గా ఉండే వ్యక్తుల వద్ద లక్ష్మి నిలుస్తుంది. వారు తాము సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత ఆదా చేసుకోగలుగుతారు.

#6. ఇంటికి వచ్చిన అతిధులను అగౌరవంగా చూసే వారి ఇంట కూడా ధనం నిలవదు. అతిధి దేవో భవ అన్నారు.. ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేసిన వారి ఇంట భాగ్యలక్ష్మి సంతృప్తి చెంది కలకాలం నిలుస్తుంది.

 

 


You may also like