వ్యాపారానికి సవాలక్ష మెళకువలు కావాలి. అన్నిటికంటే.. కస్టమర్లను ఆకర్షించగలిగి.. వారికీ నమ్మకం కుదిరేలా ఉండాలి. ఓ సారి నమ్మకం కుదిరాక కస్టమర్లు వారంతట వారు వస్తూ ఉంటారు. అయితే.. ఈ వ్యాపారి మాత్రం కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఎత్తు వేశారు. చేపలు కొంటె.. లీటర్ పెట్రోల్ ఉచితం గా ఇస్తాం అంటూ ప్రకటన చేసారు.
దీనితో.. జనాలు అక్కడ క్యూ కట్టారు. మధురై బిబి కులం వద్ద ఉన్న పెద్ద చేపల దుకాణానికి చెందిన వ్యాపారి కొత్త గా వ్యాపారం చేయాలనే ఉద్దేశం తో ఈ ప్రకటన చేసారు. కనీసం ఐదువందల కంటే ఎక్కువ రూపాయలతో వ్యాపారం చేస్తే లీటర్ పెట్రోల్ ఉచితం అంటూ బోర్డు పెట్టాడు. దీనితో.. జనాలు క్యూ కట్టారు.