అడ్రస్ కావాలి అని అడుగుతూ ఒక అమ్మాయితో ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గౌహతి కి చెందిన భావన కశ్యప్ ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే వీధిలో ఒక యాక్టివా స్కూటర్ మీద ఒక యువకుడు వచ్చి భావన ని సినాకీ పాత్ కి దారి కావాలి అని అడిగాడు.
భావన,తనకి అడ్రస్ తెలియదు అని చెప్పారు. అప్పుడు ఆ యువకుడు, తనకి ఏమి వినిపించట్లేదు అని దగ్గరికి వచ్చి చెప్పమని అడిగాడు. భావన అతని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ యువకుడు ఆమె ఛాతిని ముట్టుకున్నాడు. అతను చేసిన పనికి షాక్ అయిన భావన తన కోపాన్ని చూపించారు.
స్కూటర్ తో సహా ఆ యువకుడిని పక్కనే ఉన్న డ్రైనేజ్ లోకి తోసేశారు. ఈ లోపు గట్టిగా కేకలు పెట్టి చుట్టు పక్కన ఉన్న వాళ్లందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్పారు. జరిగిన విషయమంతా చెప్తూ వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో భావన మాట్లాడుతూ, “అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించి, పారిపోవడానికి ప్రయత్నించాడు.
“వెంటనే నేను స్కూటర్ వెనకాల టైర్ పైకి లేపాను. దాంతో అది ముందుకు వెళ్లలేదు. తర్వాత డ్రైనేజ్ లోకి తోసేశాను అని చెప్పారు. అతని పేరు మధుసనా రాజ్ కుమార్ అని కూడా చెప్పారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని అతన్ని అరెస్ట్ చేశారు.
watch video :















