భారత మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ ఇక లేరు. కార్డియాక్ అరెస్ట్ కారణం గా ఆయన మంగళవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 1983 లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ మొదటిసారిగా కప్ గెలిచింది. ఈ మ్యాచ్ లో క్రికెటర్ యశ్ పాల్ శర్మ కూడా పాలుపంచుకున్నారు.

ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ కి వెళ్లి వచ్చిన యశ్ పాల్ శర్మ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. హఠాత్తుగా గుండెపోటు రావడం తో ఆయన మనందరికీ దూరం అయ్యారు. ఇప్పటి వరకు ఆయన తన కెరీర్ లో 37 టెస్టులు ఆడారు. వాటిలో 1,606 పరుగులు చేసారు. అలాగే.. 42 వన్డేల్లో అతను 883 పరుగులు చేశారు. అతను ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 1983 లో జరిగిన ప్రచారంలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆయన చేసిన అర్ధ సెంచరీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

















