మరోమారు భారత క్రికెట్ ప్లేయర్ రైనా వ్యాఖ్యలతో ఇండియాకు ప్రస్తుతం కెప్టెన్ గా ఎవరు వ్యవహరించాలనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇంతకీ రైనా చేసిన ఆ వ్యాఖ్యలేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా రైనా ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ధోనీ కెప్టెన్సీ లో ఆడటం తనకు చాలా ఆనందంగా ఉందని అతను ఇండియాకు వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అని అన్నాడు.అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ కు నెక్స్ట్ ధోని అయ్యే అవకాశం రోహిత్ కి ఎక్కువగా ఉందని రైనా కామెంట్ చేశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా తను కెప్టెన్ గా సాధించిన ఫీట్స్ నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ధోనీ సారథ్యంలోని సి.ఎస్.కే లో ఆడుతున్న రైనా నిదహాస్ ట్రోఫీలో రోహిత్ సారథ్యంలో ఆడారు. ఆ టైంలో రోహిత్ యంగ్ ప్లేయర్స్ అయిన చహల్ శార్దూల్, వాషింగ్ టన్ కు అందించిన సహాయ సహకారాలు.అలాగే టీంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వంటివి అతన్ని ఐపీఎల్ లోనే కాక మిగతా ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ గా నిలబెడుతున్నాయి అని ఆయన అన్నారు.